Akhil, Bindu: టాస్క్ జరుగుతూ పర్సనల్ గా గొడవ పడ్డ హౌస్ మేట్స్..! ఎందుకో తెలుసా..!

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం చాలా విభిన్నమైన టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. బిందుకి, ఇంకా అకిల్ కి మద్యలో జరిగిన గొడవలని ఇంకా రేపేందుకు బిగ్ బాస్ కావాలనే స్కెచ్ వేసినట్లుగా టాస్క్ ఇచ్చాడు. వీరిద్దరూ భార్యాభర్తలుగా విడాకులు తీస్కోబోతున్నారని, హౌస్ లో జరిగిన రెండు, మూడు సంఘటనలు ఆధారంగా కోర్టులో వాదించాలని, బిందు తరపున లాయర్ గా శివ, అఖిల్ తరపున నటరాజ్ మాస్టర్ లాయర్ గా వ్యవహరించారు. ఇక్కడే ముమైత్ ఖాన్ రీ ఎంట్రి అనేది హౌస్ మేట్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది.

Click Here To Watch NOW

జడ్జిగా ముమైత్ ఖాన్ వచ్చి తీర్పు ఇచ్చేందుకు కూర్చునే సరికి హౌస్ మేట్స్ ఖంగుతిన్నారు. రీ ఎంట్రీ ఇచ్చావా లేదా ఈ టాస్క్ కోసమే వచ్చావా అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ, ముమైత్ ఖాన్ తనదైన స్టైల్లో హౌస్ మేట్స్ ని సస్పెన్స్ లో పెట్టింది. ఇక కోర్టు ప్రోసెడింగ్స్ తో హౌస్ హీటెక్కిపోయింది. పాత గాయాల్ని మళ్లీ రేపినట్లుగా అయ్యింది. నటరాజ్ మాస్టర్ పర్సనల్ గా పాయింట్స్ తీసి మరీ మాట్లాడినట్లుగా అయ్యింది. అందులోనూ బిందుకి ఎగైనిస్ట్ అనేసరికి ఎక్కడలేని పాయింట్స్ ని తెచ్చి మరీ వాదన చేశారు.

ముందుగా టాస్క్ జరిగేటపుడు బిందు అఖిల్ ని “నువ్వు ఆడా..ఆడా” అనే పాయింట్ పై మాట్లాడారు. బిందుని కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. శివ బిందుని కాపాడటంలో కాస్త తడబడ్డాడు. మద్యలో కోర్టుకి బ్రేక్ ఇవ్వగానే హౌస్ మేట్స్ అందరూ ముమైత్ ఖాన్ ని హగ్ చేసుకున్నారు. ముఖ్యంగా తేజు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఫైనల్ గా బిందు, అఖిల్ ఇద్దరూ కూడా బాగా వాదించుకున్నారు. హౌస్ లో జరిగిన సంఘటలన్నింటినీ బయటకి తీస్కుని వచ్చారు. బిందు నన్ను గేమ్ ఆడట్లేదని అంటున్నారు అని, బ్లేమింగ్ చేస్తున్నారని వాదన చేసింది.

అఖిల్ ఫ్రెండ్స్ లేకుండా ఆడలేడు అనే పాయింట్, అలాగే ఫుడ్ విషయంలో అఖిల్ బిందుని అన్నమాటలు ఇవన్నీ కూడా కోర్టులో వాదించుకున్నారు. ఇద్దరి ఆర్గ్యూమెంట్స్ లో హౌస్ వేడెక్కిపోయింది. ఇక్కడే లాజికల్ పాయింట్స్ తో అఖిల్ ని లాక్ చేయాలని చూశారు. రెండు టీమ్స్ గా విడిపోయిన హౌస్ మేట్స్ ఎవరు వాదనలో గెలుస్తారో వారు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. దీంతో మిగతా హౌస్ మేట్స్ కూడా బలంగా వాదించడం మొదలు పెట్టారు. అదీ మేటర్.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus