బిగ్ బాస్ 4: ఫైనల్ విన్నర్ అతనేనా..!

బిగ్ బాస్ హౌస్ లో ఫినాలే టిక్కెట్ కోసం జరుగుతున్న టాస్క్ లెవల్ త్రీ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. ఇందులో భాగంగా సోహైల్ ఇంకా అఖిల్ ఇద్దరూ కూడా పొద్దన్న 8.30నిమిషాలకి ఉయ్యాల ఎక్కారు. ఎవరైతే ఉయ్యాల దిగకుండా లాస్ట్ వరకూ అలాగే ఉంటారో వారికి ఫినాలే టిక్కెట్ లభిస్తుందని చెప్పాడు బిగ్ బాస్. దీంతో ఇద్దరూ కూడా పోటా పోటీగా నువ్వా – నేనా అన్నట్లుగా తలబడ్డారు. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా గేమ్ పైనే ఫోకస్ పెట్టారు. అర్ధరాత్రి వరకూ కదలకుండా అలాగే కూర్చుని ఉన్నారు.

కింద కాలు కూడా పెట్టలేదు. దీనికి సంచాలక్ గా అభిజిత్ ని నియమించాడు బిగ్ బాస్. అంతేకాదు, స్టోర్ రూమ్ లో నుంచి పాలు, ఆయుర్వేదం జ్యూస్ , స్వెట్టర్ ఇలా అన్ని వస్తువలని పంపించి టాస్క్ ని కొనసాగించాల్సిందిగా ఆదేశించాడు. మద్యలో గన్ సౌండ్స్ కూాడ వేసి హౌస్ మేట్స్ కి భయం పుట్టించారు. ఎంత చేసినా కూడా అఖిల్ అండ్ సోహైల్ ఇద్దరూ అదరకుండా బెదరకుండా అలాగే కూర్చుని ఉన్నారు.

ఇక ఉయ్యాలలో ఉండే అర్హత మీకు ఎందుకు ఉందో ఒకరికొకరు చెప్పుకొని జ్యూస్ తాగిపించుకోండి అంటూ గేమ్ పెట్టాడు బిగ్ బాస్. ఇద్దరి మద్యలో కాసేపు వాగ్వివాదం జరిగింది. సోహైల్ మాటలకి అఖిల్ కి కాస్త కోపం వచ్చింది. అంతేకాదు, ఉయ్యాలలో మజాక్ లు ఆడుతుంటే ఇద్దరూ కాసేపు అలిగారు కూడా. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు విన్నర్ అయ్యారు అనే క్యూరియాసిటీ బిగ్ బాస్ ప్రేక్షకులని ఊరిస్తోంది. ఎక్స్ క్లూజివ్ గా అందుతున్న సమాచారం ప్రకారం రేస్ టు ఫినాలే టిక్కెట్ ని అఖిల్ సొంతం చేస్కున్నాడని తెలుస్తోంది. మరి ఎలా వచ్చింది.. ? సోహైల్ శాక్రిఫైజ్ చేశాడు..? లేదా ఉయ్యాలలో నుంచి దిగిపోయాడా ? అనేది ఎపిసోడ్ చూస్తునే కానీ తెలియదు. అదీ మేటర్.

trong>Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus