అఖిల్ అక్కినేని (Akhil) మంచి ఎనర్జిటిక్ హీరో. డాన్సులు, ఫైట్లు బాగా చేస్తాడు. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కటౌట్ కూడా అఖిల్ కి ఉంది. కానీ ఆ కటౌట్ కి తగ్గ సక్సెస్ ఇంకా పడలేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) మంచి సక్సెస్ అయ్యింది. ‘హలో’ (Hello) కూడా పర్వాలేదు. కానీ ‘ఏజెంట్’ (Agent) నిరాశపరిచింది. ఆ సినిమా పెద్ద కాస్ట్ ఫెయిల్యూర్. అఖిల్ నెక్స్ట్ సినిమా ఇంకా ప్రారంభం కాలేదు. ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్లో అఖిల్ ఓ భారీ బడ్జెట్ సినిమా చేయాలి.
అనిల్ ఆ సినిమాని డైరెక్ట్ చేయాల్సి ఉంది. ఆ ప్రాజెక్టు కోసం రూ.100 కోట్లు బడ్జెట్ కేటాయించారట. కానీ అది ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. అందుకు కారణం ఏంటనేది ఇన్నాళ్లు బయటకు రాలేదు. ఇన్సైడ్ టాక్ ప్రకారం బడ్జెట్ సమస్యల వల్లే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు అని సమాచారం. ఇదే బ్యానర్లో చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) రూపొందుతుంది.
ఈ సినిమాకు రూ.150 కోట్లు బడ్జెట్ అవుతుందట. ప్రస్తుతానికి ‘విశ్వంభర’ నిర్మాణం పైనే ‘యూవీ’ సంస్థ ఫోకస్ పెట్టిందట. సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ అవుతుంది. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ చాలా బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగి డబ్బులు బాగా వస్తే.. అఖిల్ సినిమా మొదలయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయట.
సమాంతరంగా 2 రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలు నిర్మించాలంటే.. ‘యూవీ’ వారికే కాదు ఎవ్వరికైనా కష్టమే కదా..! గత ఏడాది వచ్చిన ‘ఏజెంట్’ ‘భోళా శంకర్’ (Bhola Shankar) ల నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) కూడా ఇలాంటి సమస్యే ఫేస్ చేశారు. ‘వాల్తేరు..’ (Waltair Veerayya) హిట్ అవ్వడంతో ‘భోళా శంకర్’ కి మంచి బిజినెస్ జరిగింది. అందువల్ల ‘ఏజెంట్’ త్వరగా ఫినిష్ అయ్యింది.