Akira: ‘ఓజీ’లో కుర్ర కల్యాణ్‌గా అతను.. మరి పవన్‌ ఒప్పుకుంటాడా?

సింపుల్‌గా, స్ట్రయిట్‌గా పాయింట్‌లోకి వచ్చేద్దాం.. పవన్‌ కల్యాణ్‌ సినిమాలో అతని తనయుడు అకీరా నందన్‌ నటిస్తే ఎలా ఉంటుంది? అయ్యో అదిరిపోతుంది.. అలాంటి కాంబో వస్తేనే అని అంటారా? అయితే ఇక్కడ కాంబో కుదరడం కష్టం కానీ.. ఇద్దరూ ఒక సినిమాలో అయితే నటించే అవకాశం ఉంది. అది కూడా పవన్‌ కల్యాణ్‌ ఒప్పుకుంటేనే. ఇదంతా ‘ఓజీ’ సినిమా కోసమే మాట్లాడుతున్నాం. ప్రస్తుతం దీని గురించే చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్‌తో ‘సాహో’ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓజీ’.

డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం పుణెలో జరుగుతోంది. ఈ సినిమాలో పవన్‌‌కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఈ సినిమా లేటెస్ట్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ పుణెలో స్టార్ట్‌ అయ్యింది. ఈ విషయాన్ని టీమ్‌ అధికారికంగా సోషల్‌ మీడియాలో అనౌన్స్‌ చేసింది. అక్కడ పవన్‌, ప్రియాంక మీద ఓ పాట చిత్రీకరిస్తారని సమాచారం. అయితే ఈ సినిమాలో 17 ఏళ్ల పవన్‌ పాత్ర ఉంటుందట.

సినిమాలో కాసేపే కనిపించినా.. చాలా కీలకంగా ఉంటుందట ఆ పాత్ర. దానికి ఎవరో కుర్ర నటుడిని తీసుకునే కంటే.. అకీరా అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారట సుజీత్‌. ఈ మేరకు తన ఆలోచనను టీమ్‌ దగ్గర ప్రస్తావించాడట. త్వరలో పవన్‌ దగ్గర ఇదే విషయం చెప్పి.. అతను ఓకే అంటే అకీరాతో షూటింగ్‌ ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నాడట. అకీరా ఎలాగూ పుణెలోనే ఉంటాడు కాబట్టి.. అక్కడే ఈ సీన్స్‌ తెరకెక్కించే అవకాశం ఉందని సమాచారం.

ఒకవేళ పవన్ ఈ ప్రపోజల్‌కు ఓకే చెబితే.. (Akira) అకీరాకు తెలుగులో ఇదే డెబ్యూ సినిమా అవుతుంది. మరి పవన్‌ ఈ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. అంతా ఓకే అనుకుంటే పవన్‌ ఫ్యాన్స్‌కి ఫుల్‌ హ్యాపీ అని చెప్పాలి. ఎందుకంటే తండ్రి సినిమాతో కొడుకు ఎంట్రీ అంటే ఇంకేం కావాలి అభిమానులకు. గతంలో మెగా ఫ్యామిలీ నుండి చాలామంది ఇలా సినిమాలు చేశారు కూడా.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus