పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన వారసుడు అకిరా నందన్‌ను తెరంగేట్రానికి సిద్ధం చేస్తున్నట్లు గతకొంత కాలంగా అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ లేటెస్ట్ గా వచ్చిన సమాచారంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు అకిరాను లాంచ్ చేయడానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను (Trivikram) ముందుకు తెచ్చారని ప్రచారం జరిగినా, ఇప్పుడు ఈ బాధ్యతలు రామ్ చరణ్ (Ram Charan) తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల అకిరా నందన్ దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు అందుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఘటనలన్నీ అకిరా లాంచింగ్‌కు సంకేతాలుగా భావించబడుతున్నాయి. అయితే, అకిరా సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రాజకీయ, సినిమాటిక్ బిజీ షెడ్యూల్‌లో ఉండటంతో అకిరా కెరీర్ విషయంలో తగిన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. అందుకే ఈ బాధ్యతను మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి నిర్వహించనున్నట్లు టాక్. రామ్ చరణ్ ఈ విషయాన్ని ఎంతో ప్రాధాన్యంతో తీసుకున్నట్లు తెలుస్తోంది. అకిరా డెబ్యూ ప్రాజెక్ట్‌కి తగిన కథను ఎంపిక చేయడం, దర్శకుడిని ఖరారు చేయడం వంటి విషయాల్లో రామ్ చరణ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ప్రాథమికంగా ఒక కథను లైన్‌లో పెట్టి, దానిపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆపై పవన్‌కు ఆ ప్రాజెక్ట్‌ను చూపించడం లాంటి కార్యక్రమాలు మెగా క్యాంప్‌లో ప్లాన్ అవుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో అకిరా తల్లి రేణు దేశాయ్ కూడా తనయుడి కెరీర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల రామ్ చరణ్‌తో టచ్‌లోకి వెళ్లిన రేణు, అకిరా ఎంట్రీపై అన్ని అప్డేట్స్‌ను తెలుసుకుంటున్నారని సమాచారం. అకిరా తొలిసారి వెండితెరపై కనిపించబోయే ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అయితే ఇది యాక్షన్ బ్యాక్‌డ్రాప్ లో ఉంటుందా? లేక ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకుంటుందా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. టాలీవుడ్‌లో హీరో వారసుల తెరంగేట్రం ఇప్పటివరకు జరగనంత గ్రాండ్‌గా అకిరా ఎంట్రీ ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుండి వచ్చే వారసుడు కావడంతో, ఈ ప్రాజెక్ట్‌ను ఎంత పెద్ద స్థాయిలో రూపొందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరి అకిరా నందన్ ఎంట్రీకి సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.