Akira Nandan: థమన్ టీమ్ లో అఖిరా నందన్.. OG కోసమే!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘OG’ (OG Movie) ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పవన్ ఫ్యాన్స్ ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. థమన్  (S.S.Thaman) సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం హాట్ టాపిక్ గా మారింది. అఖిరా నందన్ (Akira Nandan) ఈ ప్రాజెక్టులో భాగమవుతారని థమన్ స్వయంగా ప్రకటించారు. అఖిరా నందన్ గురించి థమన్ మాట్లాడుతూ, “అఖిరా పియానో అద్భుతంగా ప్లే చేస్తాడు.

Akira Nandan

అతనిని ‘OG’ కోసం పిలవాలని నిర్ణయించుకున్నా,” అని తెలిపారు. ఆయన మాటల ప్రకారం, అఖిరా పియానోపై రెండు నెలల పాటు థమన్ వద్ద శిక్షణ పొందారు. అఖిరా చేతుల వేళ్ల పొడవు పియానో ప్లేయింగ్‌కు చాలా సరిపోతుందని థమన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ తనయుడిని ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేసుకోవడం అభిమానులకు స్పెషల్‌గా మారింది. ఇదే కాదు, OG కోసం ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగులను (Ramana Gogula) కూడా పిలిచి ఓ పాట పాడించాలని థమన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

రమణ గోగుల పవన్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పాటలు అందించిన విషయం తెలిసిందే. ‘తమ్ముడు,(Thammudu) ‘బద్రి’ (Badri) లాంటి చిత్రాల సక్సెస్‌లో వారి కాంబినేషన్ కీలకంగా నిలిచింది. OGలో రమణ గోగుల పాట ఫ్యాన్స్‌కు మరో ట్రీట్ లాంటిదేనని చెప్పవచ్చు. OG సినిమా గురించి థమన్ మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ చిత్రంలో కొంత భాగం జపాన్, కొరియన్ బ్యాక్‌డ్రాప్లో ఉండబోతుందట.

అందుకే, కొరియన్ మ్యూజిక్ టీంతో కలసి పనిచేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 80% షూటింగ్ పూర్తయిందని, జనవరి నుంచి కొత్త అప్‌డేట్స్ అందజేస్తామని చెప్పారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్‌తో OGపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు అఖిరా నందన్, రమణ గోగులతో ఈ ప్రాజెక్ట్ మరింత స్పెషల్‌గా మారనుంది.

డీసెంట్ హిట్ గా నిలిచిన ’35- చిన్న కథ కాదు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus