Akhil: లెనిన్ కోసం అఖిల్ బాబు స్పెషల్ ట్రైనింగ్!

‘ఏజెంట్’ (Agent) ఫ్లాప్ తర్వాత మళ్లీ మాస్‌కు తగ్గ కథ కోసం వెతుకుతున్న అఖిల్ అక్కినేని (Akhil Akkineni)  ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘లెనిన్’(Lenin) పై పూర్తి ఫోకస్ పెట్టాడు. ఈసారి ఎలాంటి హడావుడి లేకుండా, పక్కా ప్రణాళికతో సినిమాను పూర్తి చేయాలని టీమ్ కసరత్తులు చేస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కొత్త దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు (Murali Kishore Abburu) డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగనుంది.

Akhil

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌లో అఖిల్ మేకోవర్, బాడీ లాంగ్వేజ్, స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రగ్డ్ లుక్‌లో అఖిల్ ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని విధంగా ఉండడం విశేషం. హీరోయిన్‌గా శ్రీలీల (Sreeleela) ఉన్న ఈ సినిమాలో కథను ఫీల్ చేసేలా విజువల్ ప్రెజెంటేషన్ ఉండబోతుందని సమాచారం. షూటింగ్ దాదాపు పూర్తయ్యింది, కానీ క్లైమాక్స్‌పై మాత్రం టీమ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టుతోంది. ఈ సినిమాలో క్లైమాక్స్ భాగమే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

జూన్ మొదటి వారం నుంచి క్లైమాక్స్ కోసం ప్రత్యేక సెటప్ వేశారు. ఇందులో ఉండబోయే యాక్షన్ బ్లాక్ కోసం అఖిల్ ప్రస్తుతం ప్రత్యేకంగా స్టంట్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఫిజికల్‌గా స్టామినా పెంచుతూ, రియలిస్టిక్ మోవ్‌మెంట్స్ కోసం ఫైటింగ్ కోచ్‌ల దగ్గర ట్రైనింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సీక్వెన్స్‌లో హాలీవుడ్ స్టైల్ వాడకంతో పాటు థమన్ అందించే నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద బలంగా నిలవనుందని వినిపిస్తోంది.

పెద్ద ప్లాన్‌తో తెరకెక్కిస్తున్న ఈ క్లైమాక్స్ యాక్షన్‌కు అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ కావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. అఖిల్ ఫిజికల్ లెవెల్‌ను ఈ సినిమాతో మళ్ళీ నిరూపించబోతున్నాడు. ‘లెనిన్’ సినిమాతో అఖిల్ కెరీర్‌లో మళ్లీ సరికొత్త మార్పు రావచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ‘ఏజెంట్’ తర్వాత వచ్చిన నిరాశను ఈ సినిమా పూర్తిగా తుడిచిపెట్టేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇకపోతే, ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తయ్యే అవకాశముంది. రిలీజ్ తేదీ కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.

కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus