Nagarjuna: కొడుకుల సినిమాలు విజయం కోసం శ్రీవారిని దర్శించుకున్న నాగ్ దంపతులు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నాగార్జున తాజాగా తన భార్య అమలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇలా నేడు ఉదయం వీఐపీ విరామ సమయంలో నాగార్జున అమల దంపతులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇలా స్వామివారి దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న అనంతరం పట్టు వస్త్రాలతో పండితులు వీరిని సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇలా స్వామివారి దర్శనం అనంతరం నాగార్జున దంపతులు మీడియా సమావేశంలో పాల్గొని తన కుమారులు నాగచైతన్య అఖిల్ నటించిన సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా నాగార్జున(Nagarjuna) మాట్లాడుతూ… ఏడాది కాలం తర్వాత ఇలా స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. త్వరలోనే మా అబ్బాయిలు నటించిన సినిమాలు విడుదల కాబోతున్నాయని తెలియజేశారు. నాగచైతన్య అఖిల్ ఇద్దరు కూడా చాలా కష్టపడి సినిమాలలో నటించారు. అయితే సినిమా కోసం వారి కష్టం మాత్రమే కాకుండా స్వామి వారి ఆశీస్సులు కూడా ఉండాలని,స్వామివారి దర్శనం కోసం వచ్చాము అంటూ ఈ సందర్భంగా నాగార్జున తన కొడుకుల సినిమాల విజయాల కోసం స్వామివారిని దర్శించుకున్నట్లు తెలియజేశారు.

అఖిల్ చైతన్య ఇద్దరు కూడా వారు నటించిన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన ఏజెంట్ సినిమా ఈనెల 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.అదేవిధంగా నాగచైతన్య దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించిన కస్టడీ సినిమా మే 12వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఇలా ఈ ఇద్దరి సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలోనే వీరి సినిమాలు మంచి విజయం సాధించాలని నాగార్జున దంపతులు తిరుమల శ్రీవారి సన్నిధి చేరుకొని స్వామివారిని ఆశీస్సులు తీసుకున్నట్టు తెలుస్తుంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus