ఆ మధ్య… ఓ టాక్ షోలో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. బాలీవుడ్లో కాంబినేషన్ల గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. ఏ ముహూర్తాన ఆయన ఆ మాట అన్నాడో కానీ… ఆ తర్వాతి నుండి వరుసగా పెద్ద పెద్ద కాంబినేషన్లు ఓకే అయిపోతున్నాయి. ఇద్దరు పెద్ద హీరోలు కలుస్తున్నారు. ఎప్పుడో సినిమా చేసి మళ్లీ ఆ ఊసే ఎత్తని వాళ్లు కూడా ఇప్పుడు మళ్లీ కలుస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా 20 ఏళ్ల క్రితం కలసి సినిమా చేసిన ఓ హీరో, హీరోయిన్ ఇప్పుడు మరోసారి కలసి ఓ సినిమా చేస్తున్నారు.
బాలీవుడ్‌కి ఒకప్పుడు హిట్ అనేది వర్షాకాలంలో వర్షం లాంటిది. ప్రతి వారం మంచి హిట్ పడేది, భారీ వర్షాలు లెక్కన రెండు వారాలకు ఒకటి పడేది. అయితే ఇప్పుడు వేసవి కాలంలో వర్షాలు లాగా అప్పుడప్పుడు పడుతున్నాయి. కరోనా – లాక్డౌన్ సమయంలో తగ్గిపోయిన విజయాల శాతం ఇప్పుడు పెరుగుతోంది. గత కొన్ని నెలలుగా పరిశ్రమ నుండి హిట్ వాసనలు భారీగా వస్తున్నాయి. హీరో అనే విషయమే మరచిపోయిన సన్నీ డియోల్ కూడా వందల కోట్ల రూపాయల వసూలు చేసే హీరో అయిపోయాడు.
ఆ విషయం పక్కనపెడితే (Hero) అక్షయ్ కుమార్ ‘ఓ మై గాడ్ 2’ తో సూపర్‌హిట్ సాధించాడు. దీంతో మరికొన్ని సీక్వెల్స్ విషయంలో నిర్ణయానికి వచ్చేశాడు. అలా ‘బడే మియాన్ చోటే మియాన్’, ‘హౌస్‌ఫుల్ 5’, ‘వెల్కమ్ 3’ చేయబోతున్నాడు. ఇందులో ‘వెల్కమ్ 3’ సినిమా కోసం అక్షయ్ కుమార్, రవీనా టాండన్‌తో మళ్లీ కలిసి నటించనున్నారట. ‘మొహ్రా’, ‘దావా’, ‘ఖిలాడియోన్ కా ఖిలాడి’, ‘కీమత్’, ‘బరూద్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు.
‘మొహ్రా’ సినిమాలోని ‘టిప్ టిప్ బర్సా పానీ…’, ‘తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్’ పాటలు ఈ జోడీ ఫ్యాన్స్‌కి ఇప్పటికీ హాట్ ఫేవరెట్స్ అని చెప్పాలి. ఇదంతా సినిమాల వరకు, నిజ జీవితంలో అక్షయ్ కుమార్, రవీనా టాండన్ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ వివిధ కారణాల వల్ల విడిపోయారు. ఇద్దరూ కలసి నటించిన ఆఖరి చిత్రం ‘పోలీస్ ఫోర్స్’. ఇప్పటికి ఇన్నాళ్లకు ‘వెల్కమ్ 3’లో మళ్లీ కలసి నటించబోతున్నారు అని సమాచారం.