ట్రాన్స్‌జెండర్ల కోసం కోటిన్నర విరాళమిచ్చిన స్టార్ హీరో!

దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ నటించిన ‘కాంచన’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో పెద్ద హిట్ అయింది. ఈ సినిమానే హిందీలో ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో తెరకెక్కుతోంది. రాఘవ లారెన్స్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే రాఘవ లారెన్స్, అక్షయ్ కుమార్ ఇద్దరూ కూడా సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. అక్షయ్ కుమార్ కొన్నాళ్ల క్రితం ట్రాన్స్‌జెండర్ల కోసం చెన్నైలో ఓ వసతి భవంతిని నిర్మించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. దాన్ని గుర్తుపెట్టుకొని తాజాగా ఆ భవంతి నిర్మాణం కోసం తనవంతుగా కోటిన్నర సహాయం అందించారు అక్షయ్ కుమార్. ఈ సందర్భంగా లారెన్స్.. అక్షయ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా ఇలా వసతి గృహాన్ని నిర్మించడం దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus