ఆన్లైన్ సంస్థ ఆ హీరో సినిమాకి అంత పెట్టడానికి కారణం?

ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఇండియా మొత్తం థియేటర్లు మూతపడ్డాయి. రిలీజ్ కావాల్సిన ఎన్నో సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలైన ‘అమెజాన్’ ‘నెట్ ఫ్లిక్స్’ ‘సన్ నెక్స్ట్’ ‘జీ5’ వంటి వాటికి డిమాండ్ బాగా పెరిగింది. ఎంటర్టైన్మెంట్ కోసం జనాలు ఈ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలనే నమ్ముకున్నారు. దీంతో రిలీజ్ కు రెడీ అయిన సినిమాలను నేరుగా ఆన్లైన్ లో విడుదల చేసి క్యాష్ చేసుకుంటున్నారు.

చిన్న సినిమాలకు అయితే స్ట్రీమింగ్ రన్ టైం ను ఆధారం చేసుకుని పేమెంట్ చేస్తున్నాయి ఈ డిజిటల్ సంస్థలు. పెద్ద సినిమాలకు భారీ రేటు పెట్టి కొనుగోలు చెయ్యడానికి రెడీ అవుతున్నాయి. త్వరలో థియేటర్లు తెరిచినా జనాలు.. సినిమా చూడటానికి వస్తారా అన్నది డౌట్. దానికి మరో 3 నెలలైనా టైం పడుతుంది. అందుకే ఇప్పుడు పెద్ద రేటు పెడితే ఆన్లైన్ రిలీజ్ ఇవ్వడానికి రెడీ అంటున్నారు పెద్ద సినిమాల నిర్మాతలు. ఇందులో భాగంగా అక్షయ్ కుమార్ ‘లక్ష్మి బాంబ్’ చిత్రాన్ని ఏకంగా 125 కోట్లు పెట్టి ‘హాట్ స్టార్’ వారు కొనుగోలు చేశారట.

సాధారణంగా 100 కోట్లు డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు పెట్టడమంటే మాటలు కాదు. అలాంటిది అక్షయ్ కుమార్ సినిమాకి ఇంత పెద్ద మొత్తం ఎందుకు పెడుతున్నట్టు? అనే అనుమానం అందరిలోనూ ఉంది. దానికి ప్రధాన కారణం అక్షయ్ కుమార్ మినిమం గ్యారెంటీ హీరో కావడమే..! అక్షయ్ నటించిన గత 12 సినిమాలు కూడా 100కోట్లు పైనే నెట్ ను కలెక్ట్ చేసాయి. అందుకే ఇంత పెద్ద మొత్తం ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus