Akshay Kumar: బాలీవుడ్‌ పరిస్థితిపై అక్షయ్‌ కుమార్‌ స్పందన!

బాలీవుడ్‌ హీరోలందు అక్షయ్‌ కుమార్‌ వేరయా అంటుంటారు. కారణంగా అందరి హీరోల్లాగా అతను సంవత్సరాల తరబడి సినిమా కోసం తీసుకోరు. సినిమా కథ విన్నామా? ఓకే అనుకున్నామా? చేసేశామా? రిలీజ్‌ చేశామా? ఆ వెంటనే మరో సినిమా మొదలెట్టేశారా అని అనుకుంటారు. సినిమా పరాజయం పాలైనప్పుడు ఇతరులను నిందించే రకమూ కాదు. అందుకే బాలీవుడ్‌ ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితిపై కూడా ఇతర హీరోలకు భిన్నంగా తనదైన శైలిలోనే మాట్లాడారు. ఇటీవల కాలంలో బాలీవుడ్‌ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమై పరాజయం పాలవుతున్నాయి.

బాలీవుడ్‌ సినిమాల పరిస్థితిపై అక్షయ్‌ కుమార్‌ తాజాగా స్పందించారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలకు రూ.20 కోట్లు – రూ.30 కోట్ల ఓపెనింగ్స్‌ పక్కాగా అని లెక్క ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం రన్‌లో కూడా అంతమొత్తం రావడం కష్టమైపోతోంది. ఆఖరికి సినిమాకు టాక్ బాగున్నా కూడా సినిమా ఆడే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి తోడు ప్రతి సినిమానూ బాయ్‌కాట్ బాయ్‌కాట్ అంటూ ఒక బ్యాచ్ నెగెటివిటీని వ్యాపింపచేస్తోంది.

ఈ నేపథ్యంలో తన కొత్త చిత్రం ‘కట్ పుట్లి’ ట్రైలర్ లాంచ్‌లో పాల్గొన్న అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ‘‘థియేటర్ల దగ్గర హిందీ సినిమాలు ఫెయిలవుతున్నాయి కదా.. ఇక అన్ని సినిమాలనూ ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తారా’’ అని అడిగితే.. ‘‘థియేటర్లలో నా సినిమాలు ఆడటం లేదంటే అవి ప్రేక్షకులకు నచ్చలేదని అర్థం. అందుకు బాధ్యత వహించాల్సిందే నేనే. సినిమా మొదలవ్వడానికి నేనే కారణం కాబట్టి… ఫెయిలైతే తప్పు నాదే’’ అని అక్షయ్‌ తేల్చేశాడు.

ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తాము మారాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు అక్షయ్‌. ‘ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు తీయాల్సిన అవసరం ఉంది. సినిమా ఫలితం విషయంలో ఎప్పుడూ ప్రేక్షకులను నిందించడానికి వీల్లేదు. అందరూ ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతులను పక్కన పెట్టి ప్రేక్షకులకు ఏం కావాలో అది ఇవ్వాలి’’ అంటూ తోటి హీరోలకు కూడా క్లాస్‌ తీసుకున్నాడు అక్షయ్‌. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అన్నట్లు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ‘రాక్షసుడు’ సినిమాకు రీమేక్‌గా ‘కట్ పుట్లి’ తెరకెక్కుతోంది. హాట్‌స్టార్‌లో ఈ సినిమా విడుదలవుతుంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus