Akshay Kumar: మల్టీ స్టార్ చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వరు?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ చిత్రాల హవా కొనసాగుతుంది సౌత్ ఇండియాలో తెరకెక్కే సినిమాలన్నీ కూడా మల్టీ స్టార్ చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సౌత్ ఇండియాలో మల్టీ స్టారర్ చిత్రాల హవా పెరిగిపోయింది. ఇక ప్రేక్షకులు కూడా ఇదే ట్రెండ్ ఎంతగానో ఇష్టపడుతున్నారు.ఓకే తెరపై ఇద్దరు హీరోలని చూడటానికి అభిమానులు ఆసక్తి చూపడంతో దర్శక నిర్మాతలు సైతం మల్టీస్టారర్ చిత్రాలను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి అక్కడ హీరోలు భయపడుతున్నారని

అందుకే ఇలాంటి మల్టీ స్టారర్ చిత్రాలను బాలీవుడ్ హీరోలు చేయరు అంటూ అక్షయ్ కుమార్ తాజాగా కాఫీ విత్ కరణ్ టాక్ షోలో మల్టీ స్టార్ చిత్రాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ హీరోలలో ఒక విధమైనటువంటి అభద్రతాభావం ఉంది. ముందు ఈ అభద్రతాభావాన్ని విడిచి పెట్టాలని సూచించారు. ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టార్ చిత్రాలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపరు అందుకే ఎక్కువగా సింగిల్ హీరో సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇక్కడ మల్టీ స్టార్ చిత్రాలు చేయలేకపోతున్నారని అక్షయ్ కుమార్ వెల్లడించారు.

ఇకపోతే కరణ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అక్షయ్ కుమార్ అగ్ర హీరోగా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత అగ్రతారగా ఉన్నారు ఇది ఎలా సాధ్యమని వీరిని ప్రశ్నించారు.ఈ విధంగా అగ్రస్థానంలో ఉండడానికి వారు పడే కృషి కారణమని అక్షయ్ కుమార్ వెల్లడించారు.

ఈయన హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఏడాదికి మూడు నాలుగు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక అక్షయ్ కుమార్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే రామ్ సేతు, OMG2, సెల్ఫీ, రాతసన్ రీమేక్, క్యాప్సూల్ గిల్, గూర్ఖా, బడే మియాన్ చోటే మియాన్, సూరరై పొట్రు వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus