అక్షయ్ కుమార్ – హిట్లు.. ఇద్దరూ కవల పిల్లలేమో అనేవారు. అంతలా విజయాల శాతం బాగుంటుంది అక్షయ్‌ది. అయితే ఇదంతా కరోనా పరిస్థితుల ముందు వరకే. కరోనా, ఆ తర్వాతి పరిస్థితులు బాలీవుడ్‌ని బాగా దెబ్బకొట్టాయి. సాధారణ కంటెంట్‌ని ఇష్టపడని ఫ్యాన్స్ బాలీవుడ్ సినిమాలకు వరుసగా షాక్‌లు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఎవరు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అంటే అక్షయ్ కుమారే అని చెప్పాలి. ఎందుకంటే వేసవి కాలంలో వర్షంలా అప్పుడప్పుడు ఫ్లాప్‌లు వచ్చే అక్షయ్‌కి… ఇప్పుడు వానా కాలంలో వర్షాలులా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి.
అక్షయ్ కుమార్‌కి హిట్ వచ్చిన ఏడాది అవుతోంది అంటే నమ్ముతారా? ఆయన నుండి వచ్చిన ఆఖరి హిట్ సినిమా ‘అత్రంగీ రే’. ఈ సినిమాలో అతను పూర్తి స్థాయి హీరో కాదు. ‘సూర్యవంశీ’ సినిమానే ఆశించిన స్థాయి విజయం అందుకున్న ఆఖరి చిత్రం. ఆ తర్వాత అక్షయ్ నుండి వచ్చిన సినిమాలన్నీ అలా వచ్చి ఇలా వెళ్లినవే. ‘బచ్చన్ పాండే’, ‘సమ్రాట్ పృథ్వీరాజ్’, ‘రక్షా బంధన్’, ‘కట్ పుత్లీ’ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. ఇందులో రెండు స్ట్రెయిట్ మూవీస్ అయితే, ఇంకో రెండు రీమేక్‌లు.
ఆ రెండు రీమేక్ సినిమాలు.. సౌత్‌లో మంచి విజయం అందుకున్నవే. ‘గద్దలకొండ గణేష్’ సినిమా ‘బచ్చన్ పాండే’గా వస్తే.. ‘రాక్షసుడు’ సినిమా ‘కట్ పుత్లీ’గా వచ్చింది. సౌత్ సినిమాల్ని బాలీవుడ్ ఆదరిస్తోంది అంటూ అందరూ అంటున్న ఈ సమయంలో ఈ రెండు సౌత్ కథలు బాలీవుడ్‌లో హిట్ కొట్టకపోవడం గమనార్హం. దీంతో సౌత్ కథల పట్ల బాలీవుడ్ జనాలు ఆకర్షితులు అవుతున్నారు అనే మాట నిజం కాదని తేలిపోయింది. ఇక్కడి కథలు కూడా అక్కడ వారికి నచ్చినట్లుగా తీస్తేనే విజయం సాధిస్తాయి.
ఆ విషయం పక్కనపెడితే.. వరుసగా సినిమాలు చేసి విజయాలు అందుకునే అక్షయ్ కుమార్ పరిస్థితి ఇలా అయిపోవడం ఏంటి? అని చర్చించుకుంటున్నారు. అక్షయ్ కష్టం పగోడికి కూడా రాకూడదు అని నెటిజన్లు అంటున్నారు. నిజమే మరి అక్షయ్‌ని హిట్ ట్రాక్ ఎక్కించే సినిమా ఏంటో మరి. ఇప్పుడు అక్షయ్ చేతిలో ‘రామ్ సేతు’,‘సెల్ఫీ’, ‘ఓ మై గాడ్ 2’, ‘ఆకాశం నీ హద్దురా’ రీమేక్, ‘క్యాప్సుల్ గిల్’ ఉన్నాయి. వీటిలో విజయం దేనికో?
Most Recommended Video
‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర</strong