‘అల వైకుంఠపురములో’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘అలవైకుంఠపురంలో’. 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న ఈ చిత్రం… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘జులాయి’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి హిట్ సినిమాల తర్వాత వస్తోన్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమన్ మ్యూజిక్ లో వచ్చిన సాంగ్స్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ రోజు టీజర్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక ‘అలవైకుంఠపురంలో’ డిజిటల్ రైట్స్ ను ప్రఖ్యాత డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అయిన ‘సన్ నెట్ వర్క్’ భారీ ధర చెల్లించి దక్కించుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీల్ కూడా పూర్తయిందట. ఇక పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ టబు, మలయాళం నటుడు జయరాం, సుశాంత్, నవదీప్, రాహుల్ రామకృష్ణ, రాజేంద్ర ప్రసాద్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus