గూరుజీ త్రివిక్రమ్ అద్భుతమైన సంభాషణలు రాయడంలో ఎంత సిద్ధహస్తుడో.. తాను తెరకెక్కించే చిత్రాల కథను లేదా సన్నివేశాలను వేరే ఆంగ్ల చిత్రాల నుండి పాత తెలుగు-తమిళ సినిమాల నుండి స్పూర్తి పొందడంలోనూ అంతే చురుగ్గా ఉంటాడు. “మీనా” ఆధారంగా “అ ఆ” చిత్రాన్ని తీసిన త్రివిక్రమ్.. తాను ఒప్పుకోకపోయినప్పటికీ “లార్గో వించ్” అనే సినిమా నుంచి భారీగా స్పూర్తి పొంది “అజ్ణాతవాసి” సినిమాను తీశాడన్నది గురుజీ కూడా ఒప్పుకొని తీరాల్సిన నిజం. అయితే.. ఇదే తరహాలో తన తాజా చిత్రమైన “అల వైకుంఠపురములో” సినిమా కథను కూడా ఓ పాత క్లాసిక్ హిట్ నుండి స్పూర్తి పొందాడని తెలుస్తోంది.
విషయం ఏమిటంటే.. అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఓ గొప్ప ఇంట్లో పుట్టినప్పటికీ, ఒక పేద ఇంట్లో పెరుగుతాడు. ఈ విషయం తెలుసుకొన్న తర్వాత పరిస్థితులు ఎలా మారాయి అనేది సినిమా కథాంశం. ఈ కథతో ఎన్టీఆర్ “ఇంటి గుట్టు” అనే సినిమా ఎప్పుడో 70లలోనే తీశారు. సో, ఇండైరెక్ట్ గా త్రివిక్రమ్ ఈసారి పెద్ద ఎన్టీఆర్ సినిమా నుండి స్పూర్తి పొందాడన్నమాట.