బుల్లి తెరపై సంక్రాంతి హీరోల సందడి.. !

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. అల్రెడీ రజిని ముంబై కమిషనర్ ఆఫ్ పోలీస్ గా దర్బార్ చిత్రంతో దిగిపోయారు. ఇక మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రం శనివారం గ్రాండ్ గా విడుదల కానుంది. ఆ మరుసటి రోజే అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో అంటూ అడుగుపెట్టనున్నారు. చివరిగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా అంటూ పండుగ రోజు 15న రానున్నాడు. దాదాపు అందరూ పెద్ద స్టార్స్ పోటీపడుతుండగా సంక్రాంతి సమరం రసవత్తరంగా మారింది. తీవ్ర పోటీ నేపథ్యంలో ప్రచారాలకు పదునుపెడుతున్నారు. అందుకే సంక్రాంతి హీరోలు ప్రేక్షకులకు చేరువయ్యేందు బుల్లి తెరను ఎంచుకుంటున్నారు.

ఎంత సోషల్ మాధ్యమాల విప్లవం నడుస్తున్నా ప్రతి ఇంటిలో ఉండే టెలివిజన్ ప్రజలపై చూపే ప్రభావనే వేరు. ఇంటిల్లిపాది ఓ చోట చేరి చూసే టీవీ.. సినిమా గురించి అన్ని వర్గాల ప్రేక్షకులకు తెలిసేలా చేస్తుంది. దీనితో దర్శక నిర్మాతలు, హీరోలు వివిధ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నారు. పనిలో పనిగా చిత్ర విశేషాలు ప్రేక్షకులతో పంచుకుంటూ సినిమ పై వారికి ఆసక్తిని కలిగిస్తున్నారు. ముఖ్యం సరిలేరు నీకెవ్వరు చిత్రం నుండి హీరో మహేష్, హీరోయిన్ రష్మిక, సంగీత, దేవిశ్రీ, దర్శకుడు అనిల్ రావిపూడి టీవీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అలాగే అల వైకుంఠపురంలో ప్రమోషన్స్ కొరకు హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ మరియు సుశాంత్ లతో పాటు హీరోయిన్ పూజ హెగ్డే, నివేదా పేతు రాజ్ పాల్గొంటున్నారు. విడుదలకు ఇంకా కొంచెం సమయం ఉండటంతో కళ్యాణ్ రామ్ పూర్తి స్థాయిలో మొదలుపెట్టలేదు. ఈ ప్రచార కార్యక్రమాల కారణంగా పండుగ రోజుల్లో హీరోలు వారి ఇంటికి వచ్చినట్లు తెలుగు ప్రజలు సంబరపడిపోతున్నారు.

దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus