Alekhya Reddy: భర్త పుట్టినరోజును తలచుకుంటూ అలేఖ్య ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

గతేడాది ఫిబ్రవరి 18వ తేదీన గుండె సంబంధిత సమస్యలతో తారకరత్న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 22వ తేదీన తారకరత్న పుట్టినరోజు కాగా పుట్టినరోజుకు 4 రోజుల ముందు ఆయన మరణించడం ఫ్యాన్స్ ను మరింత బాధ పెట్టింది. నిన్న తారకరత్న పుట్టినరోజు కాగా భర్త తారకరత్న ఫోటోకు అలేఖ్యారెడ్డి ముద్దు పెట్టుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భర్త తారకరత్నకు నివాళులు అర్పించారు. తారకరత్న అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా తారకరత్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు నివాళులు అర్పిస్తున్నారు.

తారకరత్న మంచి మనస్సు ఉన్న మనిషి అనే సంగతి తెలిసిందే. షూటింగ్ లో ప్రతి ఒక్కరినీ తారకరత్న గౌరవించేవారని చిన్న ఆర్టిస్టుల పనితీరును సైతం ఎంతో ప్రశంసించేవారని జబర్దస్త్ రాజమౌళి ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. అలేఖ్యారెడ్డి తారకరత్న బర్త్ డే సందర్భంగా పూల బొకేతో నివాళి అర్పించడంతో పాటు ఎమోషనల్ కావడం జరిగింది. మనస్సు నిండా బాధ ఉన్నా అలేఖ్యారెడ్డి మాత్రం బాధను దిగమింగుతూ భర్తకు నివాళులు అర్పించారు.

2012 సంవత్సరంలో తారకరత్న (Alekhya Reddy) అలేఖ్యారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలేఖ్యారెడ్డి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అలేఖ్యారెడ్డి కుటుంబానికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా బాలయ్య చూసుకుంటున్నారని తెలుస్తోంది. అలేఖ్యారెడ్డి ప్రస్తుతం సినీ రంగానికి కూడా పూర్తిస్థాయిలో దూరంగా ఉన్నారు. పిల్లల కెరీర్ పై ఆమె ప్రధానంగా దృష్టి పెట్టారని తెలుస్తోంది. అలేఖ్యారెడ్డికి కెరీర్ పరంగా మంచి జరగాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మీడియాకు, ఇంటర్వ్యూలకు ఆమె దూరంగా ఉంటున్నారు. తారకరత్న తన సినీ కెరిర్ లో పదుల సంఖ్యలో సినిమాలలో నటించగా ఎక్కువ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. తారకరత్న అప్పట్లో పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకునేవారని వార్తలు వచ్చాయి. తారకరత్న తమ హృదయాల్లో మాత్రం జీవించే ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్
ఆ విషయంలో నేను బాధ పడలేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus