Ali: అలీని ఇరికించేసిన మహేష్‌బాబు.. ఆ హీరోయిన్‌పై సెటైర్లు

మహేష్‌బాబు చూడటానికి క్లాస్‌గా, కామ్‌గా కనిపిస్తాడు కానీ.. ఆయన చాలా చిలిపి అని, సరదాగా ఉంటాడని చెబుతుంటారు కలసి పని చేసినోళ్లు. సినిమా సెట్స్‌లో మహేష్‌బాబు అల్లరి ఓ లెవల్‌లో ఉంటుందని చెబుతుంటారు. ఆయన ఒక్కసారి యాక్టివ్‌ అయ్యాడంటే మిగిలినవాళ్లంతా కామ్‌ అయిపోతారు. స్మూత్‌గా వేసే సెటైర్లకు కౌంటర్లు వేయడం కూడా చుట్టూ ఉన్నవాళ్లకు కష్టమే అని చెబుతుంటారు. ఒకట్రెండు సందర్భాల్లో సినిమా ప్రచారం సందర్భంగా ఇచ్చే ఇంటర్వ్యూల్లో ఆ సందడి మనం చూశాం కూడా. అయితే సినిమా సెట్స్‌లో ఎలా ఉంటారో ఇటీవల అలీ చెప్పుకొచ్చారు.

Ali

మహేష్‌బాబు, అలీ కొన్ని సినిమాలు చేశారు. ఆ సినిమాల్లో ‘శ్రీమంతుడు’ ఒకటి. ఈ సినిమా సెట్స్‌లో ఓసారి జరిగిన సరదా సంఘటన గురించి ఇటీవల అలీ చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఓ రోజు సెట్స్‌లో మహేష్‌బాబు, అలీ వచ్చి ఉన్నారట. ఆ సీన్‌లో వారితోపాటు కథానాయిక శ్రుతి హాసన్‌ కూడా నటించాల్సి ఉందట. అయితే ఆ రోజు ఆమె రావడం కాస్త ఆలస్యమైందట. దీంతో అలీతో మహేష్‌బాబు ఎప్పుడొస్తుందో శ్రుతి.. అని అన్నారట. దానికి అలీ ఇచ్చిన రిప్లై ఆ తర్వాత అతన్ని ఇబ్బంది పెట్టిందట.

‘కమల్‌ హాసన్‌ కూతురు కదండీ.. కాస్త ఆలస్యంగా వస్తుందిలే’ అని నవ్వుతూ మహేష్‌బాబుతో అన్నారట అలీ. ఆ మాట అన్న కాసేటికి సెట్‌లోకి శ్రుతి హాసన్‌ వచ్చిందట. వెంటనే మహేష్‌ బాబు రియాక్ట్‌ అవుతూ ‘శ్రుతీ.. నువ్వు కమల్‌ హాసన్‌ కూతురివి కదా.. లేటుగానే వస్తావు అని అలీ అంటున్నాడు’ అని అనేశాడు. అలా నన్ను మహేష్‌ ఇరికించేశాడు అని ఆ ఈవెంట్‌లో చెప్పుకొచ్చారు అలీ. మరి మీ ఫ్రెండ్‌ పవన్ కల్యాణ్‌ సినిమాలో ఎప్పుడు మళ్లీ నటిస్తారు అని అలీని అడిగితే.. త్వరలోనే అంటూ చిన్న హింట్‌ ఇచ్చారు. గతంలోనూ ఆయన ఇదే మాట చెప్పారు కానీ అవ్వలేదు. ఇప్పుడైనా అవుద్దేమో చూడాలి.

మరో రెండు అడుగుల దూరంలో జాన్వీ సినిమా.. ఆస్కార్‌ వస్తుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus