‘ఓ సినిమా.. విడిపోయిన స్నేహితులను మళ్ళీ కలుపుతుంది…కానీ రాజకీయాలు మాత్రం స్నేహితులను కూడా శత్రువులుగా మార్చేస్తాయి’ అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పారు. ఆ మాట నిజమే అని.. అలీ, పవన్ కళ్యాణ్ లను చూస్తే అర్ధం చేసుకోవచ్చు. ‘అలీ నా గుండె.. అతను నా సినిమాలో నటించకపోతే.. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది’ అంటూ పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమా వేడుకల్లో చెప్పుకొచ్చాడు. కానీ గతేడాది జరిగిన ఎన్నికల పుణ్యమా అని వీరి మధ్య గ్యాప్ ఏర్పడింది.
రాజమండ్రిలో జరిగిన ‘జనసేన’ మీటింగ్ లో ‘అలీ నా స్నేహితుడని నమ్మాను..కానీ ఆయన వైసిపి పార్టీకి ప్రచారం చేస్తున్నాడు.. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఎన్నో సార్లు ఆదుకున్నాను’ అంటూ పవన్ కామెంట్స్ చేసాడు. దానికి అలీ ‘మీరు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకముందే.. నేను పెద్ద స్టార్ కమెడియన్ ని.. మీరు నాకు ఏం సాయం చేశారు? మీరు నా గుండెలో ఉన్నారు అనుకున్నాను.కానీ ఈరోజు నా గుండె పగిలిపోయింది’ అంటూ ఎమోషనల్ గా సమాధానం ఇచ్చాడు.
ఇదిలా ఉండగా.. లాక్ డౌన్ కారణంగా కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్న అలీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో పవన్ కళ్యాణ్ గురించి స్పందించాడు. అలీ మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. నేనన్నా.. ఆయనకి చాలా ఇష్టం. ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ నేను నటించాను. ప్రతీ ఏడాది ఆయన నాకు మామిడి పళ్ళు పంపిస్తారు. కానీ ఈ సంవత్సరం పంపలేదు. రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల పంపడం కుదర్లేదేమో’ అంటూ అలీ చెప్పుకొచ్చాడు.
రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!