టాలీవుడ్ ప్రముఖ కమెడియన్లలో ఒకరైన అలీకి ఈ మధ్య కాలంలో ఊహించని స్థాయిలో సినిమా ఆఫర్లు తగ్గినా పలు టీవీ షోలతో అలీ బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. అలీ పొలిటికల్ గా ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. అయితే వైసీపీ గెలుపు కోసం అలీ ఎంతో కష్టపడినా ఆ పార్టీ నుంచి అలీకి ఎలాంటి పదవి దక్కలేదనే సంగతి తెలిసిందే. అలీకి జగన్ పదవి ఇస్తారని జోరుగా ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు.
అయితే వైసీపీకి గుడ్ బై చెప్పాలని అలీ భావిస్తున్నారని తెలుస్తోంది. అలీ రాబోయే రోజుల్లొ జనసేనలో చేరే ఛాన్స్ ఉందని బోగట్టా. గతంలోనే అలీకి జనసేన నుంచి పిలుపు వచ్చినా వేర్వేరు కారణాల వల్ల అలీ వైసీపీలో చేరాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ అలీ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైరల్ అవుతున్న వార్తల గురించి అలీ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
అలీకి క్రేజ్ పెరుగుతుండగా తర్వాత ప్రాజెక్ట్ లతో అలీ సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలీ పరిమితంగా సినిమాలలో నటిస్తున్నా గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలకు మాత్రమే అలీ ఓటేస్తున్నారు. అలీ జనసేనలో చేరితే ఆయనకు కచ్చితంగా మంచి గుర్తింపు దక్కే అవకాశాలు అయితే ఉంటాయి. అలీ ఎన్నికల్లో పోటీ చేస్తారో లేక జనసేన పార్టీ గెలవడానికి తన వంతు సపోర్ట్ చేస్తారేమో చూడాల్సి ఉంది.
అలీకి స్టార్ డైరెక్టర్లు ఆఫర్లు ఇస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ అలీ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని గతంలో వార్తలు ప్రచారంలోకి రాగా అలీ జనసేనలో చేరితే ఆ వార్తలు కూడా ఆగిపోయే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. అలీ ప్రస్తుతం సినిమాలకు రోజుకు 5 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.