Ali Reza: సొంత బిజినెస్ లు ఉండటం అవసరం!: అలీ రెజా

మోడల్ గా తన ప్రయాణం మొదలుపెట్టి అనంతరం బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి నటుడు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈయన ఇటీవల వధువు అని వెబ్ సిరీస్ లో కూడా నటించారు ఈ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతున్న సంగతి తెలిసినదే. ఈ క్రమంలోనే ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు.

ఇక ఈ సిరీస్ మొత్తం ఆలీ చుట్టే తిరుగుతూ ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఈ సిరీస్ లో నటించిన నందుతో తనకు చాలా మంచి స్నేహితుడిగా మారిపోయారని మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడిందని తెలిపారు. ఇకపోతే గతంలో ఈయన మెట్రో కథలు అనే సినిమాలో సీనియర్ నటి సనాతో కలిసి నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమాలో అలీ రెజా ఆమెతో కలిపి కాస్త రొమాంటిక్ సన్నివేశాలలో నటించారు ఈ సందర్భంగా ఆయన ఈ విషయం గురించి మాట్లాడుతూ.. మెట్రో కథలు సినిమా సమయంలో నా నటన పట్ల చాలామంది నన్ను ట్రోల్ చేశారు. అయితే నేను చేసింది తప్పు కాదని తెలిపారు. ఆమెతో నేను ఒక రొమాంటిక్ సీన్లలో నటించడం తప్పుకాదని సమాజంలో జరుగుతున్నది మేము చూపించామని తెలియజేశారు.

ఒక తాగుబోతు భర్తకు మిడిల్ క్లాస్ వైఫ్ గా ఉండడం ఎంత కష్టం అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా చూపించామని ఈ సినిమాలో ఎలాంటి తప్పు లేదని తెలిపారు.ఇక ఈయన తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి సొంత బిజినెస్ ఉండడం చాలా అవసరం అని తెలిసింది. అందుకే నేను ముంబైలో రెండు రెస్టారెంట్లు ప్రారంభించామని ఈ సందర్భంగా (Ali Reza) ఆలీ రెజా తన బిజినెస్ ల గురించి కూడా తెలియజేశారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus