బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అలియా భట్, రణ్ బీర్ కపూర్ లకు పండంటి ఆడపిల్ల జన్మించిన సంగతి తెలిసిందే. అలియా భట్ డెలివరీ విషయంలో కొన్ని ట్రోల్స్ వస్తున్నా అలియా భట్ అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేశారు. అలియా భట్ కూతురు పేరు అల్మా అని సమాచారం. ఒక రియాలిటీ షోలో అలియా భట్ పాల్గొన్న సమయంలో ఆ షోలో పాల్గొన్న అబ్బాయి పేరును అలియా భట్ అడిగారు.
ఆ అబ్బాయి తన పేరు అల్మా అని చెప్పగా ఆ పేరును తనకు కూతురు పుడితే ఆ అబ్బాయి పేరును పెడతానని అలియా భట్ చెప్పుకొచ్చారు. అలియా భట్ మాట మీద నిలబడతారని అలియా భట్ కూతురుకు ఇదే పేరు ఫిక్స్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే అలియా భట్ తన కూతురికి అబ్బాయి పేరు పెడతారా? అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పేరు గురించి వైరల్ అవుతున్న కామెంట్లపై అలియా భట్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
మరోవైపు అలియా భట్ త్వరలో కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు చేయనున్నారని తెలుస్తోంది. అలియా భట్ కెరీర్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. అలియా భట్ నటించిన సినిమాలు కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధిస్తూ ఆమె రేంజ్ ను పెంచుతున్నాయి. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుని అలియా భట్ రాబోయే రోజుల్లో కూడా మరెన్నో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అలియా భట్ ప్రాజెక్ట్, నిడివిని బట్టి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. అలియా భట్ తెలుగులో మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి టాలీవుడ్ లో నటిగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా అలియా భట్ కు ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారు. అలియా భట్ అటు ఫ్యామిలీకి ఇటు కెరీర్ కు సమానంగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
Most Recommended Video
లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!