RRR: ఆర్ఆర్ఆర్ సీక్వెల్ విషయంలో అలియా నిర్ణయం అలా ఉండనుందా?

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రతో ప్రశంసలు పొందినా ఆ పాత్ర నిడివి విషయంలో విమర్శలు వ్యక్తమయ్యాయి. పది కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్న అలియా భట్ పట్టుమని పది నిమిషాలు కూడా సినిమాలో కనిపించకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయనే సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కు రాజమౌళి డైరెక్టర్ గా వ్యవహరించకపోవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఆర్ఆర్ఆర్ (RRR) సీక్వెల్ కు అలియా భట్ ఓకే చెప్పడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన నిడివి ఎక్కువగా ఉంటే మాత్రమే అలియా భట్ ఈ సినిమాకు ఓకే చెప్పే ఛాన్స్ అయితే ఉంది. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ విషయంలో అలియా నిర్ణయం ఈ విధంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలియాల్సి ఉంది. అయితే అభిమానులు మాత్రం ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కు సైతం రాజమౌళి దర్శకత్వం వహిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రాజమౌళి నుంచి క్లారిటీ వస్తే మాత్రమే ఎన్నో ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు దొరికే అవకాశాలు అయితే ఉంటాయి. జక్కన్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా జక్కన్న వేగంగా సినిమాలను తెరకెక్కించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

మహేష్ రాజమౌళి కాంబినేషన్ సినిమాపై అంచనాలు పెరుగుతుండగా ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయని తెలుస్తోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus