బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా అలియా భట్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే అలియా భట్ రెమ్యునరేషన్ ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయం సాధించింది. ఈ సినిమాలో సీత పాత్ర నిడివి తక్కువైనా ఆ పాత్ర ద్వారా అలియా భట్ కు మంచి పేరు వచ్చిందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం అలియా భట్ ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
అయితే అలియా భట్ తొలి రెమ్యునరేషన్ మాత్రం కేవలం 15 లక్షల రూపాయలు కావడం గమనార్హం. అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ నెల 9వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాతో అలియా భట్ ఖాతాలో సక్సెస్ చేరే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సాధారణంగా 15 లక్షల రూపాయలు ఎక్కువే అయినా తొలి సినిమాకు అలియా భట్ కు ఈ మొత్తం తక్కువేనని చెప్పవచ్చు.
19 సంవత్సరాల వయస్సులోనే అలియా భట్ హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాకు 15 లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఆ చెక్ ను నేను అమ్మకు ఇచ్చానని అప్పటినుంచి ఇప్పటివరకు నేను సంపాదించిన మొత్తాన్ని అమ్మకే ఇస్తున్నానని అలియా భట్ వెల్లడించారు.
ప్రస్తుతం అలియా భట్ గర్భవతి అయినప్పటికీ రెస్ట్ తీసుకోకుండా సినిమా కార్యక్రమాలతో ఆమె బిజీగా ఉంటున్నారు. ఈ విషయంలో మాత్రం అలియా భట్ గ్రేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అలియా భట్ కు తెలుగులో కూడా ఆఫర్లు వస్తున్నా కొన్ని కారణాల వల్ల ఆమె ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. సినిమాసినిమాకు అలియా భట్ రేంజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.