ఈ హీరోయిన్ సినిమా కోసం 16 కేజీలు తగ్గిందట..!

బాలీవుడ్ లో బాలనటిగా, హీరోయిన్ గా నటించిన అలియా భట్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు అలియా భట్ పుట్టినరోజు. అందం, అభినయం పుష్కలంగా ఉన్న అలియా హీరోయిన్ గా నటించిన తొలి సినిమా కోసం ఏకంగా 16 కేజీల బరువు తగ్గడం గమనార్హం. ప్రముఖ నిర్మాత మహేష్ భట్ కూతురైన అలియా తండ్రి నిర్మాతగా సినిమాలతో బిజీగా ఉండటంతో చిన్నప్పుడు ఆయనను మిస్ అయ్యానని తెలిపారు.

అయితే బ్యాక్ గ్రౌండ్ ఉన్నా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా కోసం అడిషన్స్ లో పాల్గొని అలియా ఎంపికయ్యారు. రియల్ లైఫ్ లో ఎంతో ధైర్యవంతురాలైన అలియా చీకటిని చూస్తే మాత్రం భయపడతారు. ఎత్తైన చెట్లను చూసినా భయం వేస్తుందని అలియా చెప్పుకొచ్చారు. పెళ్లి, ప్రేమ లాంటి విషయాలు తన వ్యక్తిగత విషయాలని ఆ విషయాలకు సంబంధించి ఇతరుల ప్రమేయం అవసరం లేదని ఆమె అన్నారు. స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న అలియా ఒకవేళ నటి కాకపోయి ఉంటే మాత్రం సింగర్ ను అయ్యేదానినని చెబుతున్నారు. పెయింటింగ్ కూడా తనకు ఎంతో ఇష్టమని అలియా భట్ అన్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్ర తనకు ఎంతో నచ్చిందని.. ఈ పాత్ర కోసం తెలుగు కూడా నేర్చుకున్నానని అలియా భట్ తెలిపారు. ఆషికీ 2 సినిమాలో ఛాన్స్ వచ్చిందని కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని ఆమె అన్నారు. పిల్లులను పెంచుకోవడాన్ని ఇష్టపడే అలియా భట్ ఇప్పటికే మూడు పిల్లులను పెంచుకుంటున్నారు. చిరుతిళ్లను తినేందుకు అలియా భట్ ఎక్కువగా ఇష్టపడతారు. ఈరోజు ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఆమె పుట్టినరోజు కానుకగా సీత లుక్ విడుదలైంది. సీత పాత్రకు అలియా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus