Alia Bhatt Baby: అలియా భట్ హాస్పిటల్ వీడియో వైరల్.. పాపని ముద్దాడుతూ..!

అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ ఏడాది వచ్చిన గంగూబాయ్ కథియావాడి, ఆర్.ఆర్.ఆర్, బ్రహ్మాస్త్రం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించింది. బ్రహ్మాస్త్రం తో అలియా భర్త రణ్ బీర్ కపూర్ కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ ఏడాది అలియాకి చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే.. ఇదే ఏడాది ఆమెకు పెళ్లైంది. ఇటీవల ఆమె తల్లైంది. ఇటీవల అలియా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.ఈ సందర్భంగా తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు ఈ దంపతులు.

కపూర్ ఫ్యామిలీ కూడా ఆనందంలో మునిగి తేలుతోంది. అయితే అలియా తన పాపని ప్రేక్షకులకు చూపించింది లేదు. కానీ అలియా హాస్పిటల్ లో తన పాపని ముద్దాడుతున్నట్టు ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పాప అయితే క్యూట్ గా ఉంది కానీ.. ఆ పక్కన ముద్దాడుతుంది అలియా అన్నట్టు అనిపించడం లేదు. ఇది పక్కా మార్ఫింగ్ అని స్పష్టమవుతుంది.

అయినప్పటికీ అలియా పేరు పై ఈ వీడియో ట్రెండ్ అవుతుంది. ఇక అలియా – రణ్ బీర్ లు 2014 నుండీ అంటే బ్రహ్మాస్త్ర షూటింగ్ టైం నుండీ ప్రేమించుకుంటున్నారు. కొన్నాళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పెళ్లి చేసుకున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus