Alia Bhatt: ఆలియా ఇష్టాయిష్టాల గురించి తెలుసా?

మొన్నీమధ్య ‘ఆర్‌ఆర్ఆర్‌’ ప్రచారం కోసం ఆలియా భట్‌ వచ్చినప్పుడు చాలామంది అడిగిన ప్రశ్న ‘R’ కాకుండా మీకు బాగా నచ్చేవేంటి అని. ఆమె లైఫ్‌లో ఆ అక్షరానికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. నిజానికి ఆమె ఇష్టాయిష్టాలు చాలానే ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి. పనిలో పనిగా ఆమె పేరు అర్థం కూడా తెలిసేసుకుందాం. ఆలియా ఫస్ట్‌ క్రష్‌ షారుఖ్‌ ఖాన్ అట. అతనితో ‘డియర్ జిందగీ’ అనే సినిమాలో కూడా నటించింది.

Click Here To Watch NOW

ఫస్ట్‌ క్రష్‌తో యాక్ట్‌ చేయడమంటే మామూలు విషయం కాదు కదా. ఇక నటనలో శ్రీదేవి నాకు స్ఫూర్తి అట. ఆలియా పుస్తకాలు బాగా చదువుతంది. ‘వెన్‌ బ్రీత్‌ బికమ్స్‌ ఎయిర్‌’ ఆమె ఫేవరెట్‌ బుక్‌. పప్పన్నం, పిజ్జా, బంగాళాదుంప వంటకాలు ఆమెకు బాగా ఇష్టమట. ఒకదానికొకటి సంబంధం లేదు కదా. చాలామంది లాగే ఆలియాకు చీకటంటే భయమట. అందుకే రాత్రివేళ ఆమె రూమ్‌లో లైట్లు ఆర్పదట. అలాగే కిటికీ తలుపులు కూడా తెరిచే ఉంచుతుందట.

ఎప్పటికైనా ప్రైవేట్‌ జెట్‌ కొనుక్కోవాలనేది ఆలియా కోరికట. కొండ ప్రాంతంలో ఓ ఇల్లు కట్టుకోవాలని అనుకుంటోందట. అలాగే చనిపోయేలోపు ప్రపంచమంతా చుట్టేయాలనేది ఆలియా కోరికట. ఆలియాకు సంగీతమన్నా బాగా ఇష్టం. అందుకే ఏఆర్‌ రెహమాన్‌ దగ్గర కొన్ని రోజులు సంగీత పాఠాలు నేర్చుకుంటుందట. ‘హైవే’, ‘ఉడ్‌తా పంజాబ్‌’ లాంటి సినిమాలతో మరో నాలుగు సినిమాల్లో పాటలు పాడింది. ఇక ఆలియా పేరుకు అర్థం కూడా తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఆలియా అంటే అరబిక్‌లో సర్వోన్నతమైన వ్యక్తి అని అర్థమట. ఈ పేరు మహేష్‌ బట్‌ పెట్టారట.

ఆలియా హీరోయిన్‌గా బిజీ అయ్యాక మహేష్‌ భట్‌.. ఇంట్లోనే ఉంటున్నారట. టైమ్‌ దొరికితే ఇద్దరూ కలిసి వైంకుఠపాళీ ఆడుకుంటారట. వాటే ఫాదర్‌ డాటర్‌ కాంబో కదా. ఇక ఆలియా సినిమాల సంగతి చూస్తే… రణ్‌బీర్‌తో ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమాలో నటిస్తోంది. సెప్టెంబరు 9న ఈ సినిమా విడుదలవుతుంది. ఇది కాకుండా ‘డార్లింగ్స్‌’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. వీటితోపాటు ‘రాఖీ ఔర్‌ రాణీకీ ప్రేమ్‌ కహానీ’ అనే సినిమా కూడా చేస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus