ఆలియా భట్ అక్క పూజా భట్ నటించిన అల్ట్రా డిజాస్టర్ సినిమా ఏదంటే..?

నెపోటిజం.. సినిమా ఇండస్ట్రీలో, రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.. ముఖ్యంగా హిందీ ఫిలిం ఇండస్ట్రీలో ఈ నెపోటిజం కారణంగా ఇతర స్టార్స్, ఆడియన్స్, నెటిజన్ల చేత ఎక్కువ ట్రోలింగ్‌కి గురయ్యారు చాలా మంది.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత నెపోటిజం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలిసిందే.. తమ పిల్లలను హీరోయిన్లుగా పరిచయం చేసిన వారు చాలామందే ఉన్నారక్కడ..లెజెండరీ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ గురించి ఇండియన్ ఆడియన్స్‌కి పరిచయం అక్కర్లేదు..

ఆయనకు పూజా భట్, ఆలియా భట్ సంతానం.. పూజా – ఆలియా అక్కా చెళ్లెళ్లే కానీ తల్లులు వేరు.. తండ్రి ఒక్కరే.. ఇద్దరి మధ్య 20 సంవత్సరాల వయసు వత్యాసం ఉంది.. 17 ఏళ్ల వయసులో తను డైరెక్ట్ చేసిన ‘డాడీ’ అనే హిందీ సినిమాతో పెద్ద కూతురు పూజాను హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేశారు మహేష్ భట్.. తర్వాత తండ్రి దర్శకత్వంలో పలు సినిమాలే చేసింది.. సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, షారుఖ్ ఖాన్, సన్నీ డియోల్, మిథున్ చక్రవర్తి లాంటి హీరోలతో ఆడిపాడింది..

నటిగానే కాకుండా నిర్మాత, దర్శకురాలిగా కూడా టాలెంట్ చూపించింది పూజా.. తన ఒరిజినల్ పేరుతోనే పలు చిత్రాల్లో క్యారెక్టర్లు చేయడం విశేషం.. 1994లో ‘బోయ్‌ఫ్రెండ్’ అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పూజా భట్.. సాయి కృష్ణ హీరో.. శ్రీహరి, నాజర్, మురళీ మోహన్, సుధ, తనికెళ్ల భరణి లాంటి భారీ తారాగణం.. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్. రామారావు నిర్మాణం.. భరత్ నందన్ దర్శకుడు.. కీరవాణి సంగీతం.. పాటలు క్లిక్ అవడంతో సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయింది..

రిలీజ్‌కి ముందు నెలకొన్న భారీ అంచనాలు చూసి.. బొమ్మ బ్లాక్ బస్టర్ అనుకుంటే.. అల్ట్రా డిజాస్టర్‌గా మిగిలిపోయింది.. పోస్టర్లకీ, ట్రైలర్‌కీ, సినిమాకీ అసలు ఏం సంబంధం లేదు అంటూ జనాలు థియేటర్ల నుండి పరుగులు తీశారు.. ఆ దెబ్బకి పూజూ భట్ మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus