బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించే సినిమాలు వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతుంటాయి. ‘రామ్‌లీల’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ వంటి సినిమాలు రిలీజ్ సమయంలో వివాదాల్లో చిక్కుకున్నాయి. కానీ ఎలాగోలా సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. రీసెంట్ గా భన్సాలీ తెరకెక్కించిన ‘గంగూబాయ్ కథియవాది’ విషయంలోనూ వివాదం చెలరేగింది. ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలో కామాఠిపుర అనే ప్రాంతం ఉంది. ఇక్కడ గంగూబాయ్ అనే మహిళ సాధారణ సెక్స్ వర్కర్ గా పని చేసి ఆ తరువాత ఏరియా మొత్తాన్ని తన గ్రిప్ లోకి తీసుకుంటుంది.
లోకల్ లీడర్స్ ను, బడా వ్యాపారవేత్తలకు కూడా హడలెత్తించింది. రాజకీయాల్లోకి సైతం వచ్చింది. ఓ సమయంలో సెక్స్ వర్కర్స్ సంక్షేమానికి కూడా పాటుపడింది. ఇప్పుడు ఆమె జీవితాన్నే సినిమాగా తీశాడు భన్సాలీ. అలియా భట్ ప్రధాన పాత్ర పోషించింది. నిజానికి ఈ సినిమా ఫస్ట్ కాపీ ఎప్పుడో రెడీ అయింది. కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. దాంతో పాటు తన తల్లి జీవితాన్ని తప్పుగా తీస్తున్నారని.. ఆమెని అవమానిస్తే ఊరుకునేదే లేదని..
వెంటనే సినిమాను ఆపేయాలని కోరుతూ గంగూబాయ్ కొడుకు కోర్టుకెక్కాడు. భన్సాలీతో పాటు అలియా మీద కూడా కేసు పెట్టాడు. దాంతో కొన్ని రోజులు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానాలు కలిగాయి. కానీ చివరికి కోర్టు కేసులు కొట్టేయడంతో గంగూబాయ్ కి లైన్ క్లియర్ అయింది. థియేటర్లు తెరుచుకోవడంతో వచ్చే ఏడాది జనవరి 6న సినిమాను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!