Jr NTR: ఎన్టీఆర్‌ సినిమా కోసం కొత్త నాయిక ఈమేనట!

తారక్‌ – కొరటాల శివ సినిమా అని అనగానే.. తొలుత వినిపించిన కథానాయికల పేర్లలో కియారా అద్వానీ ఒకటి. ఆమె మ్యాగ్జిమమ్‌ ఫైనల్‌ అయినట్లే అని చెప్పుకొచ్చారు కూడా. అయితే ‘ఆర్ఆర్ఆర్‌’ ప్రచారంలో ఆలియా భట్‌ను చూసి… ఈమె అయితే బాగుండు అనే పుకార్లు మొదలయ్యాయి. ఆ తర్వాత ఆలియా పుణ్యమా అని ఆమెనే ఫిక్స్‌ అంటూ రాసుకొచ్చేశారు. అయితే ఇప్పుడు తొలుత అనుకున్న కియారా అడ్వాణీనే హీరోయిన్‌గా ఫైనల్‌ అయ్యిందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

Click Here To Watch NOW

‘గంగూబాయి కాఠియవాడి’ సినిమా ప్రచారంలో ఆలియా భట్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయని చెప్పింది. ఆ మధ్య ఎన్టీఆర్‌ను ఇదే విషయం అడిగితే ‘డైరక్టర్‌కి ఏవో ప్లాన్స్‌ ఉన్నాయండి. లెట్‌ హిమ్‌ డూ’ అంటూ సస్పెన్స్‌లో పెట్టాడు. అయితే డైరక్టర్‌ ప్లాన్స్‌ వర్కవుట్‌ కాలేదు అని సమాచారం. కారణం ఆలియా పెళ్లినే అని తెలుస్తోంది. రణ్‌బీర్‌ కపూర్‌ను ఇటీవల ఆలియా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆలియా ప్రజెంట్‌ ప్రాజెక్ట్‌లు, వైవాహిక జీవితాన్ని బ్యాలెన్స్‌ చేయాలి అంటే కొత్త ప్రాజెక్ట్‌లు ఓకే చేయడం కుదరని పనే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. పెళ్లి పనులు, హనీమూన్‌… ఇలా వరుసగా ఆలియా బిజీగా ఉంటుందని, ఈలోపు ‘బ్రహ్మాస్త్ర’ రిలీజ్‌కు దగ్గరవుతుందని చెబుతున్నారు. ఈ సినిమా ప్రచారం చేసుకోవాలి. రణ్‌బీర్‌, ఆలియా కలిసి నటించిన ఈ సినిమా పెళ్లి తర్వాత తొలి సినిమా అవుతుంది. కాబట్టి సెంటిమెంట్‌గా బలంగానే ప్రచారం చేస్తారు. ఇది కాకుండా మరో రెండు సినిమాలున్నాయి.

దీంతో తారక్‌ సినిమాను ఆలియా ఓకే చేయడం కష్టమని తేల్చేస్తున్నారు బాలీవుడ్‌ జనాలు. దీంతో కొరటాల శివ వేరే హీరోయిన్‌ను వెతికే పనిలో పడ్డారట. ఈ క్రమంలో కియారా అద్వానీ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో ‘భరత్‌ అనే నేను’ సినిమాలో ఇద్దరూ కలసి పని చేశారు. దీంతో ఆమె అయితేనే సినిమాకు బాగుంటుందని కొరటాల భావిస్తున్నారట. మరి హెడ్డింగ్‌లో ఆలియా అన్నారు.. అదేం లెక్క అంటారా. కియారా అసలు పేరు అదే కాబట్టి. ఆలియా అద్వానీని సినిమాల కోసం కియారా అద్వానీగా మారింది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended VideoSet featured image

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus