Ali Family: అరగంట సేపు నరకం చూశాం.. గుండె ఆగిపోయినంత పనైంది: అలీ భార్య

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అలీ అనతి కాలంలోనే పాపులర్ అయ్యి,అటు తర్వాత వరుస అవకాశాలను అందుకుని చిన్న వయసులోనే స్టార్ కమెడియన్ గా ఎదిగాడు అలీ. కొన్నాళ్ల తర్వాత హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. అలా అని కామెడీ సినిమాల్లో నటించడం మానేయలేదు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూనే మరోపక్క టీవీ వ్యాఖ్యాతగా బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నాడు. ‘సీతాకోకచిలుక’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అలీ….1200 కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఆయన అలీ నటించారు.

అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు ఆలీకి గౌరవ డాక్టరేట్ ను ప్రకటించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అలీ తండ్రి మహమ్మద్ బాషా పేరుపై చారిటబుల్ ట్రస్ట్ ను కూడా స్థాపించి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. అలీ భార్య జుబేదా కూడా యూట్యూబ్ ఛానల్ ను మెయింటైన్ చేస్తూ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన ఫ్యామిలీ ఓ పెద్ద ప్రమాదం నుండి బయటపడినట్టు తెలిపి అందరికీ షాకిచ్చింది.

అలీ (Ali) పెద్ద కూతురు ఫాతిమా అమెరికా నుండి రావడం మరోపక్క ఆమె అత్తమామలు గుంటూరు నుండి రావడంతో.. సరదాగా ఎక్కడికైనా వెళ్లి రావాలని అనుకున్నారట. అలా అంతా ఫ్లైట్ ఎక్కగా.. భారీ వర్షం కారణంగా వారు ఎక్కిన ఫ్లైట్ ప్రమాదంలో ఉన్నట్లు అలెర్ట్ వచ్చిందట. దీంతో వారికి గుండె ఆగిపోయినంత పనైందట. అరగంట తర్వాత విమానం సేఫ్ గా ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నట్టు జుబేదా చెప్పుకొచ్చింది. ఆ అరగంట నరకం చూసినట్టు కూడా ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus