SPY Movie: నిఖిల్ ‘స్పై’ కి పాజిటివ్ టాక్.. ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయిగా..!

  • June 29, 2023 / 06:19 PM IST

నిఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘స్పై’. ఈరోజు అనగా జూన్ 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని చ‌ర‌ణ్ తేజ్ ఉప్ప లపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై కె రాజ శేఖ‌ర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ రావడం..

అలాగే ‘కార్తికేయ 2 ‘ తర్వాత నిఖిల్ నుండి రాబోతున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ‘స్పై’ పై అంచనాలు పెరిగాయి. అయితే మొదటి షో నుండే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.యాక్షన్ ఎపిసోడ్స్, ట్విస్ట్స్ చాలా బాగున్నాయట. ది గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇది. రెండో ప్రపంచ యుద్ధంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి, లక్షలాది మంది సామాన్యులను సైనికులుగా తయారు చేసి వారిలో యుద్ధ స్పూర్తిని నింపారు సుభాష్ చంద్రబోస్.

అలాంటి గొప్ప వ్యక్తి 1945లో ప్లేన్ క్రాష్ అయ్యి చనిపోయినట్లు మనం చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ అది కవరప్ స్టోరీ అని ‘స్పై’ టీజర్ లో చూపించారు. అలాగే సుభాష్ చంద్రబోస్ గురించి మిస్ అయిన ఓ ఫైల్ కి సంబంధించిన కథ ఇదని ట్రైలర్లో చూపించారు. గ్యారీకి దర్శకుడిగా ఇది మొదటి చిత్రమైనప్పటికీ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా స్పై ని రూపొందించాడట. ఈరోజు పబ్లిక్ హాలిడే కూడా ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి.

నిఖిల్ కెరీర్లో ‘స్పై’ (SPY Movie) తొలిరోజు భారీ ఓపెనింగ్స్ నమోదు చేసిన మూవీగా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం 200 K డాలర్స్ కి చేరువలో ఉన్నట్టు సమాచారం. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది కాబట్టి.. ఈ ఆదివారానికి బయ్యర్స్ అంతా సేఫ్ జోన్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus