Chatrapathi: ‘ఛత్రపతి'(4K) రీ రిలీజ్.. ఎప్పుడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో ‘ఛత్రపతి’ అనేది ఓ స్పెషల్ మూవీ. ఎందుకంటే అప్పటివరకు ప్రభాస్ లవ్ స్టోరీస్, యూత్ ఫుల్ మూవీస్ మాత్రమే తీశాడు. కానీ అతనికి మాస్ ఇమేజ్ ను కట్టబెట్టింది ‘ఛత్రపతి’ మూవీ. 2005 సెప్టెంబర్ 30 న రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్రానికి దర్శకుడు. అంతకు ముందు వీరి కాంబినేషన్లో ‘స్టూడెంట్ నెంబర్ 1 ‘ ‘సింహాద్రి’ వంటి సినిమాలు రావాలి.

కానీ అవి మిస్ అయ్యాయి. ఫైనల్ గా ‘ఛత్రపతి’ తో వీరి కాంబో కుదిరింది. ఈ కథలో ప్రభాస్ ని తప్ప వేరే హీరోని ఊహించుకోవడం కష్టం. ఎందుకంటే సముద్రంలో సొరచేప తో ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, కాట్రాజ్(సుప్రీత్) తో ఫైట్ కావచ్చు, ఇంటర్వెల్ సీక్వెన్స్ కావచ్చు.. ! ఇవన్నీ కూడా ప్రభాస్ కటౌట్ కి కరెక్ట్ గా సెట్ అయ్యాయి. ఇంకా చెప్పాలి అంటే ప్రభాస్ కి మాత్రమే సెట్ అయ్యాయి. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే..

ఇప్పుడు రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సందర్భంగా (Chatrapathi) ‘ఛత్రపతి’ ని 4K కి డిజిటలైజ్ చేసి రీ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు ఉండడంతో.. ‘ఛత్రపతి'(4K ) ని రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. మరి ఈసారి బాక్సాఫీస్ వద్ద ‘ఛత్రపతి’ ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus