Gang Leader re-release: చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ రీ రిలీజ్ ఎప్పుడంటే..!

ఓ పర్ఫ్యూమ్ యాడ్‌లో చెప్పినట్టు.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏం నడుస్తుంది? అని అడిగితే.. రీ రిలీజుల ట్రెండ్ నడుస్తోంది అని చెప్పొచ్చు.. ఓపక్క సంక్రాంతికి పెద్ద హీరోల మధ్య బీభత్సమైన పోటీ నెలకొంది.. థియేటర్ల కోసం దబిడి దిబిడే అన్నట్టుంది వ్యవహారం.. ఇటీవలే డైరెక్టర్ త్రివిక్రమ్ ‘నువ్వే నువ్వే’, రెబల్ స్టార్ ప్రభాస్ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ‘వర్షం’ రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.. దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఏఎన్నార్ నటించిన ‘ప్రతిబింబాలు’ చిత్రం తొలిసారిగా విడుదలైంది.

సరైన ప్రమోషన్ లేకపోవడం వల్ల ఈ సినిమా వచ్చి వెళ్లిన సంగతి కూడా పెద్దగా ఎవరికీ తెలియలేదు. మొన్నటకి మొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బాద్‌షా’ కూడా సెలెక్టెడ్ స్క్రీన్లలో రీ రిలీజ్ చేస్తే.. దాదాపు అన్నిచోట్లా హౌస్ ఫుల్స్ పడ్డాయి.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వంతు వచ్చింది.. మెగా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌కి సాలిడ్ సర్‌ప్రైజ్ ఏంటంటే.. మెగాస్టార్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘గ్యాంగ్ లీడర్’ రీ రిలీజ్ కాబోతోంది. కొద్ది నెలలక్రితం ‘ఘరానా మొగుడు’ కొన్ని థియేటర్లలో స్పెషల్ షోలు వేశారు.

ఫ్యాన్స్ బాగానే ఎంజాయ్ చేశారు. కాకపోతే పిక్చర్ అండ్ సౌండ్ క్వాలిటీ గురించి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఈసారి అలాంటివేమీ జరగకుండా.. పక్కా క్లారిటీతో డిసెంబర్లో థియేటర్లలోకి రాబోతున్నాడు ‘గ్యాంగ్ లీడర్. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రింట్ రీ మాస్టర్డ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. క్యూబ్, డీటీఎస్ లాంటి పనులు పూర్తయిన తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి జంటగా..

విజయ బాపినీడు దర్శకత్వంలో.. శ్యాంప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ మీద మాగంటి రవీంద్రనాధ్ చౌదరి నిర్మించిన ‘గ్యాంగ్ లీడర్’ 9 మే 1991న విడుదలై సంచలన విజయం సాధించింది. చిరు సత్తా ఏంటనేది మరోసారి బాక్సాఫీస్‌కి రుచి చూపించిందీ సినిమా.. బప్పీ లహరి పాటలైతే ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ‘వాల్తేరు వీరయ్య’ కంటే ముందుగానే.. ప్రేక్షకాభిమానులు మరోసారి వింటేజ్ మెగాస్టార్‌ని‌ తెరమీద చూడబోతున్నారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus