ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలు తెలుగులోకి తేవాలంటే ఒకప్పుడు వెంకటేశ్ పేరు తొలుత వినిపించేది. అయితే ఇప్పుడు చాలామంది ఇదే పనిలో ఉన్నారు. అయితే రీమేక్ రాజు అంటే విక్టరీ వెంకటేశ్ అనే చెప్పాలి. అంతలా రీమేక్‌లతో హిట్లు కొట్టారాయన. ఇటీవల అలా విజయం సాధించిన చిత్రం ‘దృశ్యం’. మలయాళ మాతృకను చక్కగా తెలుగులోకి తీసుకొచ్చి విజయం సాధించారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ చేయాలని నిర్ణయించారట. నిజానికి ఇది కూడా రీమేకే. మలయాళ ‘దృశ్యం 2’ ఇటీవల ఓటీటీలో విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో దానిని తెలుగులోకి తేవడానికి వెంకటేశ్ ఓకే చెప్పారట.
నిజానికి ‘దృశ్యం 2’ మలయాళంలో మొదలైనప్పుడే తెలుగు రీమేక్ ముచ్చట్లు వినిపించాయి. ప్యారలల్‌గా తెలుగులోనూ తీస్తారని వార్తలొచ్చాయి. అయితే అది వీలవలేదు. మలయాళం తీసేసి, విడుదల చేసేసి హిట్ కొట్టేశారు. సినిమా టాక్ చూశాక వెంకీ అండ్ టీమ్ సినిమాను ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా విడుదల చేయాలని అనుకున్నారట. అందుకే సినిమాను అధికారికంగా ప్రకటించేశారు.తొలి ‘దృశ్యం’ను తెలుగులో శ్రీప్రియ తెరకెక్కించారు. అయితే రెండో ‘దృశ్యం’ను మాతృకను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ చేతిలోనే పెట్టారు.
తొలి దృశ్యంను రెండు నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ సారి సురేష్ ప్రొడక్షన్స్ సోలోగా నిర్మిస్తోంది. మార్చి తొలి వారం నుండి సెట్స్‌పైకి తీసుకెళ్తారట. రెండు షెడ్యూళ్లలోనే చిత్రీకరణ పూర్తి చేసేలా ప్లాన్స్ వేస్తున్నారు. ‘ఎఫ్3’ కంటే ముందే ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. అంటే విజయదశమికి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈలోగా ‘నారప్ప’ను తీసుకొస్తారు. తెలుగు ‘దృశ్యం’ క్లైమాక్స్‌ను జీతూ జోసెఫ్ దగ్గరుండి తెరకెక్కించిన విషయం తెలిసిందే.
Most Recommended Video
పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!