పాత సినిమాలను 4K కి అప్డేట్ చేసి రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ ‘పోకిరి’ తో మొదలైంది. ఎవ్వరూ ఊహించని విధంగా రీ రిలీజ్ లో కూడా మంచి కలెక్షన్లు సాధించింది ‘పోకిరి’ . దీంతో పవన్ కళ్యాణ్ ‘జల్సా’ మూవీని కూడా రి రిలీజ్ చేశారు మేకర్స్. ఆ సినిమా కూడా సూపర్ గా కలెక్ట్ చేసింది. ఆ తర్వాత కుప్పలు తెప్పలుగా పాత సినిమాలను 4Kలో రీ రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలని కొంతమంది మేకర్స్, డిస్టిబ్యూటర్స్ భావించారు కానీ అది వర్కౌట్ కాలేదు.
ఒక్క చెన్నకేశవ రెడ్డి, వర్షం తప్ప మిగిలిన సినిమాలు డీసెంట్ నెంబర్స్ పెట్టలేకపోయాయి. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ నటించిన క్లాసిక్ మూవీ ‘ఖుషి’ త్వరలో రీ రిలీజ్ కాబోతుంది. 2001లో విడుదలై ఘనవిజయం సాధించడమే కాకుండా ఓ క్లాసిక్ గా మిగిలిపోయింది ఖుషి. ఈ మూవీని రీ రిలీజ్ చేయాలని అభిమానులు చాలా కాలంగా కోరుతున్నారు కానీ ఇప్పటివరకు అది కుదరలేదు. అయితే న్యూయార్ కానుకగా డిసెంబర్ 31న ‘ఖుషి’ చిత్రాన్ని 4Kలో రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
‘శ్రీ సూర్య మూవీస్’ బ్యానర్ పై ఏ.ఎం.రత్నం నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించాడు. 4K రిజల్యూషన్‌లో 5.1 డాల్బీ ఆడియో క్వాలిటీతో ‘ఖుషి’ డిసెంబర్ 31న రీ రిలీజ్ కాబోతుంది. దీంతో పవన్ అభిమానుల్లో కొత్త ఆనందం నెలకొంది. ‘వింటేజ్ పవన్ కళ్యాణ్ ను చూడాలని, ఇంటర్వెల్ సీక్వెన్స్ అయిన నడుము ఎపిసోడ్ ను, మణిశర్మ పాటలను తనివితీరా థియేటర్లలో ఎక్స్పీరియన్స్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు.
అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?
2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!