‘కింగ్’ నాగార్జున కెరీర్లో ఆల్ టైం హిట్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘మన్మధుడు’ కి స్పెషల్ ప్లేస్ ఉంటుంది. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇప్పటి స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్.. కథ మాటలు అందించడం జరిగింది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ఈ చిత్రాన్ని టీవీల్లో ఎగబడి చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది అనేది వాస్తవం. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆఫీస్ వాతావరణమే ఎక్కువ కనిపిస్తుంది.
సెకండాఫ్ చాలా వరకు ప్యారిస్ లో ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో ఎంతో క్వాలిటీతో కూడుకున్న సినిమాని అందించారు. కింగ్ నాగార్జున ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించడం మరో విశేషంగా చెప్పుకోవాలి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ సూపర్ హిట్టే. ‘అందమైన భామలు’ ‘వద్దురా సోదరా’ ‘నేను నేనుగా లేను’ ‘గుండెల్లో ఏముందో’ వంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎమోషన్స్ సీన్స్ కి ఆయువుపట్టుగా నిలిచింది.
ఇక ఇన్ని విశేషాలు సంతరించుకున్న ‘మన్మధుడు’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే బాగుణ్ణు అని నాగార్జున ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో నాగార్జున పుట్టినరోజు నాడు అనగా ఆగస్టు 29 న ‘మన్మధుడు’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్టు నాగార్జున టీం వెల్లడించింది. 4K కి డిజిటలైజ్ చేసి ‘మన్మధుడు’ ని రీ రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈసారి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి..!