#RT69: రవితేజ- త్రినాథ్ రావ్ నక్కిన ల.. కాంబో మూవీకి ముహూర్తం ఫిక్స్..!

మాస్ మహారాజ్ రవితేజ … ‘క్రాక్’ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.ఆ చిత్రం సక్సెస్ ఇచ్చిన జోష్ తో ప్రస్తుతం ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే ఇప్పుడు మరో సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రెడీ అయ్యాడు. ‘సినిమా చూపిస్త మావ’ ‘నేను లోకల్’ ‘హలో గురు ప్రేమ కోసమే’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించి విజయాలను అందుకున్న దర్శకుడు త్రినాధ్ రావ్ నక్కినతో రవితేజ

ఓ మూవీ చేయబోతున్నట్టు ఎప్పుడో అధికారిక ప్రకటన వచ్చింది. కానీ వెంటనే ఈ చిత్రం మొదలు కాకపోవడంతో ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యిందనే గాసిప్స్ వినిపించాయి. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ.. అక్టోబర్ 4 నుండీ ఈ చిత్రం షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్టు ఈరోజు అధికారిక ప్రకటన చేశారు నిర్మాతలు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ మరియు ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ల పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి డైలాగ్స్ మరియు కథని అందిస్తుండగా.. భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రం రూపొందనుందని చిత్ర యూనిట్ సభ్యులు ధీమాగా చెబుతున్నారు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus