రిషబ్ శెట్టి – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మూవీ… నిజమేనా..!

  • March 15, 2023 / 08:35 AM IST

గత ఏడాది కన్నడ డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు సాధించాయి. అందులో ‘కాంతార’ కూడా ఒకటి. ఆ సినిమా హీరో పేరు కానీ, హీరోయిన్ పేరు కానీ తెలుగు ప్రేక్షకులకు కనీసం తెలీదు. అయినా సరే ఆ మూవీ ఇక్కడ ఏకంగా రూ.50 కోట్ల పైనే గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ కలుపుకుని అయితే రూ.400 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన చిత్రమిది. రిషబ్ శెట్టి ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేశాడు. త్వరలో ‘కాంతార 2’ కూడా రూపొందనున్న సంగతి తెలిసిందే.

‘కాంతార’ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2 పై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉండగా.. త్వరలో రిషబ్ శెట్టి ఓ టాలీవుడ్ హీరోతో సినిమా చేయబోతున్నాడు అనే వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. ఆ టాలీవుడ్ హీరో మరెవరో కాదు విజయ్ దేవరకొండ. ‘లైగర్’ వంటి ఫ్లాప్ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇటీవల సమంత కూడా ఈ చిత్రం షూటింగ్లో తిరిగి జాయిన్ అయ్యింది. అయితే విజయ్ తో రిషబ్ శెట్టి.. సినిమా అంటే అది మల్టీస్టారరా? లేక రిషబ్ డైరెక్షన్లో విజయ్ సినిమా చేస్తాడా? అనే డౌట్ అందరికీ రావచ్చు.

అయితే రోషన్ శెట్టి దర్శకత్వంలోనే రౌడీ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. అయితే రిషబ్ కు.. రష్మికకి పడదు అంటారు కదా.. మరి విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ అయిన రష్మిక.. ఈ ప్రాజెక్టు చేయనిస్తుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారిక ప్రకటన వస్తే కానీ ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మరోపక్క రిషబ్ శెట్టి.. ‘కాంతార2’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus