దసరా తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ షురూ!

రాజమౌళికి కరోనా వచ్చింది. తగ్గింది కూడా! ఇప్పుడు ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. చిత్రీకరణ ప్రారంభించడానికి రెడీగా ఉన్నారు. దసరా తర్వాత హైదరాబాద్ నగరంలో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. కొత్త షెడ్యూల్ లో హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ జాయిన్ అవుతారు. కరోనా నేపథ్యంలో అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ చేయడానికి నిర్మాత డివివి దానయ్య దర్శకుడు రాజమౌళి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సాంకేతిక నిపుణులకు చిత్రీకరణకు సిద్ధంగా ఉండమని సమాచారం అందించారట.

మార్చిలో మన దేశంలో కరోనా మహమ్మారి పడగ విస్తరిస్తున్న సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ స్వచ్ఛందంగా చిత్రీకరణలకు తాత్కాలిక విరామం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వాన్ని చిత్రీకరణకు అనుమతులు కోరుతూ తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు విజ్ఞప్తి చేసినప్పుడు పరిమిత నటీనట-సాంకేతిక బృందంతో చిత్రీకరణ చేయడానికి రాజమౌళి ముందుకొచ్చారు. ఎందుకో మళ్లీ వెనకడుగు వేశారు.

వినాయక చవితి సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ “జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రీకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆలోచిస్తున్నాం” అని అన్నారు. నెమ్మదిగా ఇండస్ట్రీలో కదలికలు మొదలవుతూ ఉండడంతో ‘ఆర్ఆర్ఆర్’ను సెట్స్ మీదకు తీసుకువెళ్లడానికి సిద్ధం అవుతున్నారు.

Most Recommended Video

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus