కరోనా వైరస్ వల్ల ఏర్పడిన లాక్ డౌన్ వల్ల.. మన టాలీవుడ్ యంగ్ హీరోలందరూ పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటి వారవుతున్న సందర్భాలను మనం చూస్తూనే వచ్చాం. ఇప్పటికే నిఖిల్, నితిన్, రానా వంటి యంగ్ హీరోలు పెళ్లిళ్లు చేసుకున్నారు.ఇక మెగా ఫ్యామిలీ ఇప్పటికే నిహారిక నిశ్చితార్ధం జరిగిపోయింది. త్వరలోనే మెగా మేనల్లుడు అయిన సాయి తేజ్ కూడా.. తన సోలో బ్రతుకుకి గుడ్ బై చెప్పబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం సాయి తేజ్ వయసు 32 ఏళ్ళు.
కాబట్టి ఇతనికి త్వరగా పెళ్లి చెయ్యాలని.. సాయి తేజ్ తల్లి విజయ దుర్గ డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగా తన స్నేహితురాలి సాయంతో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒంగోలు పరిసర ప్రాంతంలో ఒక అమ్మాయిని కూడా చూసి వచ్చిందట. అమ్మాయి నచ్చడంతో ఇదే విషయాన్ని తన సోదరుడు చిరంజీవికి కూడా తెలియజేసారట. చిరు కూడా ‘సాయి తేజ్ కు కరెక్ట్ జోడి అని… పెళ్లి ఫిక్స్ చెయ్యడానికి పనులు మొదలు పెట్టమని’.. ఆమెకు సూచించారట.
అయితే పెళ్లి మాత్రం.. వధూవరుల జాతకాల ప్రకారం 2021 సమ్మర్ టైంలోనే ఉంటుందని సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సుబ్బు డైరెక్షన్లో ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంలో నటిస్తున్న తేజు.. అటు తరువాత దేవ కట్టా డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.
Most Recommended Video
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!