Sivaji: రజనీకాంత్ శివాజీ రీరిలీజ్ డేట్ ఇదే.. ఆరోజే రీరిలీజ్ కానుందా?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా హీరోలు పుట్టినరోజు సందర్భంగా వారి కెరియర్లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సినిమాలను తిరిగి 4కె వెర్షన్లు విడుదల చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టాయి. అయితే కేవలం తెలుగు హీరోల సినిమాలు మాత్రమే కాకుండా కోలీవుడ్ హీరోలు నటించిన సినిమాలను కూడా తెలుగులో తిరిగి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇదివరకు సూర్య హీరోగా నటించిన తెలుగు వెర్షన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన శివాజీ సినిమాని కూడా తిరిగి విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 2007వ సంవత్సరంలో శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ శ్రియ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం శివాజీ ఇందులో రజనీకాంత్ రెండు గెటప్స్ లో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈ సినిమాలో సుమన్ విలన్ పాత్రలో నటించారు.

అప్పట్లోనే దాదాపు 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినటువంటి ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు భాషలలోనూ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని సుమారు 160 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రజనీకాంత్ సినీ కెరియర్ లోనే ఇది కూడా అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిపోయింది. ఇక ఈ సినిమా త్వరలోనే తిరిగి విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ 12వ తేదీ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

రజనీకాంత్ డిసెంబర్ 12వ తేదీ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో అందుకు మూడు రోజులు ముందుగా అంటే డిసెంబర్ 9వ తేదీనే ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇదివరకే ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి తిరిగి ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా సరికొత్త రికార్డులను సృష్టించాలని ఈ సినిమాని ఎంతో విజయవంతం చేయాలని అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి ఈ సినిమా (Sivaji) ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus