Varun Tej: వరుణ్‌ తేజ్‌ లైనప్‌ సాలిడ్‌ సెట్‌ చేసుకుంటున్నాడు!

ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు పెద్దలు. ఈ సూత్రాన్ని మన కుర్ర హీరోలు బాగా వంట బట్టించుకున్నారు. అందుకే మన దగ్గర మంచి విజయాలు సాధించాక పక్క ఇండస్ట్రీపై దృష్టి పెడుతున్నారు. అలా పక్క చూపులు చూస్తున్న తాజా హీరో వరుణ్‌తేజ్‌. బాలీవుడ్‌లో ఓ సినిమా చేయాలని వరుణ్‌తేజ్‌ చాలా రోజులుగా చూస్తున్నారు. ఓ పది నెలల క్రితం ఓసారి వరుణ్‌తేజ్‌ బాలీవుడ్‌ సినిమా ముచ్చట వినిపించింది. ఇప్పుడు మళ్లీ వినిపిస్తోంది.

వ‌రుణ్ తేజ్ హీరోగా సోనీ పిక్చ‌ర్స్ సంస్థ తెలుగు, హిందీ భాష‌ల్లో ఓ సినిమాను రూపొందించబోతోంది అని సమాచారం. ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఓ కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న‌ట్టు సమాచారం. క‌థ దాదాపుగా సిద్ధమైపోయిందట. వ‌రుణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ని తెలుస్తోంది. అయితే ఓసారి చిరంజీవి దగ్గరకు కథ వెళ్లిందని చెబుతున్నారు. అక్కడి నుండి ఓకే అనిపించుకుంటే ఇక షూటింగే అంటున్నారు.

వరుణ్‌తేజ్‌ ఇటీవల కాలంలో వరుస సినిమాలు ఓకే చేస్తున్నాడు. ‘గని’ ఈ నెల 8న విడుదల చేస్తున్నారు. వచ్చే నెలాఖరున ‘ఎఫ్ 3’ని తీసుకొస్తున్నారు. ఇవి కాకుండా ప్ర‌వీణ్ స‌త్తారు సినిమాను ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత. సోనీ సినిమా మొద‌ల‌వుతుంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో చెబుతారట. అన్నట్లు త్రినాథరావు నక్కిన సినిమా కూడా ఒకటి లైన్‌లో ఉందని సమాచారం. దీంతో కరోనా గ్యాప్‌ తర్వాత వరుణ్‌తేజ్‌ సాలిడ్‌ లైనప్‌ సెట్‌ చేసుకుంటున్నాడు.

అయితే ఇక్కడ ఒకటే డౌట్.

తెలుగులో మంచి స్వింగ్‌లో ఉన్న సమయంలో బాలీవుడ్‌లో ‘ప్రతిబంధ్‌’, ‘ఆజ్‌ కా గూండా రాజ్‌’ సినిమాలు చేశాడు చిరంజీవి. ఈ రెండూ సరైన విజయం ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్లీ ఆయన బాలీవుడ్‌ వైపు చూడలేదు. రామ్‌చరణ్‌ వెళ్లి ‘తుఫాన్‌’ చేశాడు. ప్రేక్షకులకు సినిమా కనెక్ట్‌ అవ్వలేదు. దీంతో రామ్‌చరణ్‌ మళ్లీ ఆ ప్రయత్నం చేయలేదు. అయితే ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో వెళ్లబోతున్నాడు.ఈ ఇద్దరి ఫ్లాప్‌ సెంటిమెంట్‌ను తుడిపేయడం ఇప్పుడు వరుణ్‌తేజ్‌ చేతిలో ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus