Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తోంది ఎవరు..?

బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీకాదు. సీజన్ వన్ నుంచీ అందరూ చూస్తున్నదే. అయితే, అందాలభామలు తమ అందంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ కి మంచి కిక్ ఇస్తారు. దీక్షాసేత్ , పూజా, కుమార్ సాయి, స్వాతి దీక్షిత్, ముక్కు అవినాష్, ఇలా అందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్లినవారే. అయితే, ఇప్పుడు సీజన్ 5లో కూడా అందాల బ్యూటీ ప్రీతి అన్షు వైల్డ్ కార్డ్ ద్వారా వస్తోందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈవార్త బయటకి వచ్చినప్పటి నుంచీ అసలు ఎవరీ ప్రీతి అన్షు అని నెటిజన్స్ తెగ సెర్చ్ చేసేస్తున్నారు. నిజానికి ఈసీజన్ మొదలు అయినపుడు వర్ష, యాంకర్ వర్షిణిలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు ప్రీతి అన్షు పేరు వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో 6వ వారం ఏ క్షణంలోనైనా వెళ్లచ్చని అంటున్నారు. మోడల్ గా కెరియర్ ని ప్రారంభించి, చిన్న చిన్న క్యారెక్టర్స్ లో సినిమాల్లో నటించింది.

మైదిల్ అనే షార్ట్ ఫిలింలో ప్రీతికి గుర్తింపు వచ్చింది. ఆతర్వాత మోడల్ గా పలు యాడ్స్ లో కూడా కనిపించింది ఈ అమ్మడు. ఇన్ స్ట్రాలో అతి కొద్దిమంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నా కూడా ప్రీతిని బిగ్ బాస్ హౌస్ వరించింది. మరి ఈ బిగ్ బాస్ ప్రీతి కెరియర్ లో ఎలా ప్లస్ అవుతుందనేది చూడాలి.ఇక ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఖచ్చితంగా ప్రీతిని హౌస్ లోకి పంపిస్తారని అంటున్నారు. ఒకవేళ శ్వేత ఎలిమినేట్ అయిపోతే వెంటనే ప్రీతి హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

[yop_poll id=”3″]

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus