కామెడీ సినిమాల్లో మనం చూసిన అల్లురి నరేష్ ను ఇప్పుడు సీరియస్ లుక్ లో చూడబోతున్నాం. నాంది సినిమాతో సక్సెస్ సాధించారు. ఇప్పుడు అల్లురి నరేష్ ఉగ్రం నరేష్ గా మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా తరువాత నన్ను ఎలా పిలుస్తారో తెలీదు కానీ ఈ ఉగ్రం మాత్రం ఒక ప్రత్యేకమైన సినిమాగా అలరిస్తుంది. ‘ ‘నాంది’ వంటి సక్సెస్ఫుల్ కాంబినేషన్లో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన చిత్రం ‘ఉగ్రం’ .
ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల మరోసారి పవర్ ఫుల్ మూవీతో వస్తున్నారనేలా క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రం మే 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అల్లరి నరేషన్ సరసన మిర్నా మీనన్ కథానాయికగా నటించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి జరిగిన మీడియా సమావేశంలో అల్లరి నరేష్ చిత్ర విశేషాలను తెలియజేశారు.నన్ను ఎలా పిలుస్తారో తెలీదు కానీ ఈ ఉగ్రం మాత్రం ఒక ప్రత్యేకమైన సినిమాగా అలరిస్తుంది.
‘నాంది’ చేసినపుడు ఎంత గర్వంగా అనిపించిందో ‘ఉగ్రం’ కూడా అలానే అనిపించింది అని నరేష్ చెప్పారు. కామెడీని మనం చిన్న చూపు చూస్తాం. కానీ కామెడీ చేసిన వాళ్ళు ఏదైనా చేస్తారు. నవరసాల్లో కష్టమైనది హాస్యం. నవ్వించడం కష్టం .. ఏడిపించడం సులువు. ఉగ్రం నరేష్ అన్నారు. దర్శకుడు విజయ్ టాస్క్ మాస్టర్. ముందే నా బలాలు, బలహీనతలు చెప్పారు. పాత నరేష్ ఎక్కడ కనిపించకూడదని చెప్పారు. విజయ్ ఏం చెప్పారో అది చేశాను.
తను యాక్ట్ చేసి మరీ చూపించారు. నటుడిగా పేరుతెచ్చుకోవాలని నాకూ వుంటుంది. అలాగే కొత్తదనం కూడా ప్రయత్నించాలి. గమ్యం, శంభో శివ శంభో, మహర్షి చిత్రాలు కొత్తదారిలో వెళ్ళడానికి నమ్మకాన్ని ఇచ్చాయి. ఆ క్రమంలోనే నాంది వచ్చింది. ఇప్పుడు ఉగ్రం వస్తోంది. గతంలో కూడా ఫైట్లు చేశాను. అయితే అవి నవ్వించడానికి. ఇందులో మాత్రం ఎమోషన్ వేరు. ఇందులో యాక్షన్స్ సీన్స్ అన్నీ నేచురల్‌గా వుంటాయి. ముందుగా రిహార్సల్ చేయడం యాక్షన్‌కి చాలా కలిసొచ్చింది.
పోలీస్ గెటప్‌లో చేసిన బ్లేడ్ బాబ్జీ, కితకితలు మంచి విజయాలు సాధించాయి. అయితే అవి కామెడీ రోల్స్. ఉగ్రంలో సీరియస్ రోల్. చాలా నిజాయితీగా చేసిన సినిమా. ఇందులో తొలిసారి ఉగ్రం రూపంలో కనిపిస్తున్నా. అని నరేష్ చెప్పారు. సినిమా చూశాను. నా హయ్యెస్ట్ గ్రాసర్ అవుతుందని అనుకుంటున్నానని ఉగ్రం నరేష్ (Allari Naresh) అన్నారు. ఈ సినిమా ఈ రోజు విడుదలై అభిమానులల్లో మంచి టాక్ వినిపిస్తోంది.