అలా చేయడం అనేది చాలా కష్టం: అల్లరి నరేష్

అల్లరి నరేష్ చేస్తున్న ఫన్ సినిమా బంగారు బుల్లోడు. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో గోల్డ్ స్మిత్ గా, బ్యాంక్ ఎంప్లాయిగా రెండు పాత్రల్లో వేరియేషన్స్ ని చూపిస్తున్నాడు అల్లరి నరేష్. తనదైన కామెడీ పంచ్ లతో ట్రైలర్ లో రెచ్చిపోయాడు కూడా. అవుట్ అండ్ అవుట్ కామెడీ మాత్రమే కాకుండా ఇందులో సీరియస్ కథ కూడా ఉందని ప్రీరిలీజ్ వేడుకల్లో హీరో అల్లరి నరేష్ చెప్పాడు.

:ఇలాంటి సినిమాలు చేయడంలో అల్లరి నరేష్ కి ప్రత్యేకమైన మార్క్ ఉంది. అంతేకాదు, పాడింగ్ ఆర్టిస్ట్ లు కూడా సినిమాకి మంచి ప్లస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. దీంతో 100 పర్సెంట్ కామెడీ సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని కాన్ఫిడెంట్ గా ఉంది చిత్రయూనిట్. బంగారు బుల్లోడు టైటిల్ కి తగ్గట్లుగానే సినిమా కూడా మంచి హిట్ కొడుతుందని అంటున్నారు. బాలయ్య బాబు బంగారు బుల్లోడు సినిమా కూడా అప్పట్లో సంక్రాంతికి రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. మహేష్ బాబు మహర్షి సినిమా తర్వాత మళ్లీ అల్లరి నరేష్ సిల్వర్ స్క్రీన్ పైన కనిపిస్తున్న సినిమా కావడం అనేది కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.

కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులని మెప్పించడం అనేది అంత ఈజీ కాదని, అలా చేయడం చాలా కష్టమైన పని అని అల్లరి నరేష్ ఇంటర్య్వూలో చెప్పడం సినిమాపై హైప్ ని పెంచుతోంది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు కలక్షన్స్ తగ్గడం, థియేటర్స్ లో కొత్త సినిమాగా అల్లరి నరేష్ మూవీ రావడం అనేది కూడా ఈ సినిమాకి మంచి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ బంగారు బుల్లోడు ఎంతవరకూ ఆడియన్స్ ని మెప్పిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదీ విషయం.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus