Allari Naresh: నాకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అదే.. పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన నరేష్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఇదివరకు వరుస కామెడీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే గత కొద్ది కాలంగా నరేష్ సినిమాల విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.నాంది సినిమాతో ఎంతో మంచి విజయాన్ని అందుకున్న నరేష్ త్వరలోనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా నవంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ ఆనంది హీరో హీరోయిన్లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రావడంతో అల్లరి నరేష్ కూడా రాజకీయాలలోకి వస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అల్లరి నరేష్ కు ఇదే విషయంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే రాజకీయాల గురించి ఈయన మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాలలోకి వస్తున్నాను అంటూ వచ్చే వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలియజేశారు.తనకు తన జీవితంలో ఏదైనా నచ్చని సబ్జెక్టు ఉంది అంటే అది కేవలం రాజకీయాలు మాత్రమేనని తాను ప్రస్తుతానికి కాదు భవిష్యత్తులో కూడా రాజకీయాలలోకి రాను అంటూ

ఈ సందర్భంగా ఈయన కుండబద్దలు కొట్టినట్టు సమాధానం చెప్పారు. ఇలా రాజకీయాలపై స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు పుల్ స్టాప్ పడింది.నాంది సినిమాతో ఎంతో మంచి గుర్తింపు అందుకున్న అల్లరి నరేష్ ఈ సినిమా ద్వారా ఎలాంటి ఆదరణ పొందుతారు తెలియాల్సి ఉంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus