టాలీవుడ్ ప్రముఖ కామెడీ హీరోలలో ఒకరైన అల్లరి నరేష్ నటించిన సినిమాలలో ఎన్నో సినిమాలు విజయవంతంగా ప్రదర్శితమై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా కామెడీ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోవడం లేదు. అల్లరి నరేష్ నటించిన సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ లుగా నిలుస్తున్నాయి. జబర్దస్త్, ఇతర కామెడీ షోల వల్ల ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలను ప్రేక్షకులు ఇష్టపడటం లేదు.
ఈ రీజన్ వల్ల అల్లరి నరేష్ సైతం కామెడీ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం అల్లరి నరేష్ కంటెంట్ కు ప్రాధాన్యత ఉన్న సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మారేడుపల్లి ప్రజానీకం సినిమాతో సినిమాతో నరేష్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా తను కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందని అల్లరి నరేష్ నమ్ముతున్నారు. అయితే అల్లరి నరేష్ హిట్ అవుతుందని భావించి ఫ్లాపైన సినిమా ఏదనే ప్రశ్నకు నేను సినిమా పేరు సమాధానంగా వినిపిస్తోంది.
అల్లరి నరేష్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ నేను మూవీ కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని భావించానని తెలిపారు. ఈ సినిమాపై నేను చాలా ఆశలు పెట్టుకున్నానని నరేష్ చెప్పుకొచ్చారు. నేను సినిమా నా స్థాయిని మారుస్తుందని అనుకుంటే అందుకు భిన్నంగా జరిగిందని నరేష్ కామెంట్లు చేశారు. మహర్షి, శంభో శివ శంభో, గమ్యం సినిమాలు తనకు మంచి పేరు తెచ్చిపెట్టాయని నరేష్ అన్నారు.
రాబోయే రోజుల్లో కూడా కంటెంట్ కు ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తానని అల్లరి నరేష్ అన్నారు. అల్లరి నరేష్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మారేడుపల్లి ప్రజానీకం సినిమాతో అల్లరి నరేష్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అల్లరి నరేష్ ఒక్కో ప్రాజెక్ట్ కు 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.