డిసెంబర్ 5న ‘పుష్ప 2’ (Pushpa 2) రిలీజ్ అవుతుంది. ప్రేక్షకుల దృష్టంతా ఆ సినిమాపైనే ఎక్కువగా ఉంది. ‘పుష్ప’ హిట్ అయ్యింది. కాబట్టి ‘పుష్ప 2’ పై అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ కూడా అదిరిపోయింది. సో ‘పుష్ప 2’ ని ఆపడం కష్టం. ఆ సినిమా హవా కచ్చితంగా 4 వారాల పాటు ఉండొచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే 2025 జనవరి 10న విడుదల కాబోతున్న రాంచరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా రిలీజ్ వరకు ‘పుష్ప 2’ దుళ్లగొట్టేయడం ఖాయంగా కనిపిస్తుంది.
Bacchala Malli
ఇది కాకుండా సెకండ్ ఆప్షన్ అనుకుంటే.. ‘ముఫాసా ది లయన్’ కింగ్ ఉంది. ఆ సినిమా డిసెంబర్ 20న విడుదల కాబోతుంది. పోనీ దాన్ని తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఏం చూస్తారులే.. అనుకున్నా, డిసెంబర్ 25న ‘రాబిన్ హుడ్’ (Robinhood) సినిమా రిలీజ్ అవుతుంది. నితిన్ (Nithiin) , దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’ (Bheeshma) హిట్ అయ్యింది కాబట్టి.. దీనికి కూడా కలిసొచ్చే అవకాశం ఉంది.
ఇలాంటి టైంలో సడన్ గా అల్లరి నరేష్ (Allari Naresh) ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) సినిమాని డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రాజేష్ దండ (Razesh Danada) నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుబ్బు (Subbu Mangadevi) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాపై ప్రస్తుతానికి ఎటువంటి బజ్ లేదు. డిసెంబర్ 20న రిలీజ్ అన్నారు కాబట్టి.. ప్రమోషన్స్ కి గట్టిగా నెల రోజులు మాత్రమే టైం ఉంది.
ఇప్పటికిప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే తప్ప.. ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) సినిమాకి హైప్ జెనరేట్ అయ్యే అవకాశాలు లేవు. ఒకవేళ ప్రమోషన్స్ కి కూడా టైం తీసుకుంటే.. ఆ మూడు సినిమాల మధ్యలో నలిగిపోవడం గ్యారంటీ. చూడాలి మరి ఏమవుతుందో…!